Paramedical Courses in AP: ఏపీ వైద్య కళాశాలల్లో పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు | విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్(ఏపీఎస్‌ఏహెచ్‌పీసీ).. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేటు పారామెడికల్ కళాశాలల్లో వివిధ పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: డీఎంఎల్‌టీ, డీఎంఐటీ, డీఓఏ, డీడీఐఏఎల్‌వై, డీఆర్‌ఈఎస్‌టీ, డీఎంఎస్‌టీ, డీఈఆర్‌ఎఫ్‌యూ, డీఓటీ, డీఆర్‌టీటీ, డీఆర్‌జీఏ, డీడీఆర్‌ఏ, డీకార్డియో, డీసీఎల్‌టీ, డీఈసీజీ, డీఏఎన్‌ఎస్, డీఎంపీహెచ్‌ఏ. అర్హత: రెండేళ్ల కాలపరిమితి గల ఈ పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్, బైపీసీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 16 ఏళ్లు నిండి ఉండాలి. ఈ కోర్సులకు సంబంధించి ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది. కాలేజీలు-జిల్లాలు: ఏపీలో మొత్తం తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, జిల్లాల్లోని పలు ప్రైవేటు పారామెడికల్ కళాశాలల్లో వివిధ పారామెడికల్ కోర్సులను అందిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న సీట్లకు ఆ కాలేజీ పరిధిలోని జిల్లాలకు చెందిన అభ్యర్థులు(లోకల్) దరఖాస్తు చేసుకోవాలి. సీట్ల సంఖ్య: తొమ్మిది గవర్నమెంట్ కాలేజీల్లో వివిధ పారామెడికల్ కోర్సుల్లో మొత్తం 1053 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా కాలేజీల పరిధిలోకి వచ్చ...