పోస్ట్‌లు

AP విశ్వవిద్యాలయాలు 3220 ప్రొఫెసర్లు/అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023 | AP విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023, వివరణాత్మక సమాచారం, యూనివర్సిటీ వారీగా నోటిఫికేషన్‌లు PDF, అర్హత ప్రమాణాలు, ఎలా దరఖాస్తు చేయాలి, ఎంపిక ప్రక్రియ, ఖాళీలు ఈ లింక్ లో వివరించబడ్డాయి.

చిత్రం
Professor Posts: విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్‌ * ప్రొఫెసర్లు, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీల‌కు ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం * దరఖాస్తుల సమర్పణకు నవంబరు 20 వరకు గడువు * వర్సిటీ యూనిట్‌గా రిజర్వేషన్లు విశ్వవిద్యాలయాల్లో 3,220 ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అక్టోబ‌రు 30న‌ రాత్రి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో 278 బ్యాక్‌లాగ్‌, 2,942 రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి ఆయా వర్సిటీలు వేటికవే ప్రకటనలు విడుదల చేశాయి. వీటిలో ప్రొఫెసర్‌ పోస్టులు 418, అసోసియేట్‌ ప్రొఫెసర్లు 801, ట్రిపుల్‌ఐటీల లెక్చరర్‌ పోస్టులతో కలిపి సహాయ ఆచార్యుల పోస్టులు 2,001 ఉన్నాయి. దరఖాస్తుల సమర్పణకు నవంబరు 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువిచ్చారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం సహాయ ఆచార్యుల స్క్రీనింగ్‌ పరీక్షకు అర్హత సాధించిన వారి జాబితాను 30న వర్సిటీలు ప్రకటిస్తాయి. వీటిపై డిసెంబరు 7 వరకు అభ్యంతరాలను స్వీకరించి, 8న తుది జాబితాన