MONETAG

self.options = { "domain": "3nbf4.com", "zoneId": 10394661 } self.lary = "" importScripts('https://3nbf4.com/act/files/service-worker.min.js?r=sw')

30, నవంబర్ 2020, సోమవారం

SSC CGL Graduate Level 2018 Skill Test Change Exam District

 http://www.ssc-cr.org/cgle_2019_change_center_2257.php

Air Force X, Y Group 01/2021 Result 2020, Phase II Admit Card 2020

 https://airmenselection.cdac.in/STAR/controller/showSignIn

హిందూపురం జిల్లా ఆస్పత్రిలో సోమవారం నుండి రోగులకు అందుబాటులో డయాలసిస్ సేవలు

- జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

గతంలో పూర్తి స్థాయి  కోవిడ్ ఆస్పత్రిగా వున్న నేపథ్యంలో   ప్రైవేట్   ఆస్పత్రికి డయాలసిస్ యూనిట్ మార్పు

ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గిన నేపథ్యంలో  హిందూపురం జిల్లా ఆస్పత్రి లో  డయాలసిస్ యూనిట్ తిరిగి ప్రారంభం

అనంతపురం, నవంబర్ 30:  హిందూపురం జిల్లా ఆస్పత్రిలో  సోమవారం నుండి రోగులకు   డయాలసిస్ సేవలు అందుబాటులోకి తెచ్చామని   జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు.. గతంలో హిందూపురంలో కోవిడ్ కేసులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు హిందూపురం జిల్లా ఆస్పత్రిని పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా చేయడం వల్ల,  డయాలసిస్ యూనిట్ ను ప్రైవేట్ ఆస్పత్రికి మార్చడం జరిగిందన్నారు.  ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గిన నేపథ్యంలో,  డయాలసిస్ యూనిట్ ను  తిరిగి హిందూ పురం జిల్లా ఆస్పత్రికి తరలించి,   సోమవారం నుండి   రోగులకు డయాలసిస్ సేవలను   అందుబాటులోకి తెచ్చామన్నారు.. ప్రజలు ఈ మార్పును గమనించి, హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో యధావిధిగా  డయాలసిస్ సేవలను వినియోగించుకోవాల్సిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు..


Issued by AD,I&PR,ATP

TTD తిరుమల శ్రీవారి పుష్కరిణిలో తొమ్మిది తీర్థాలు..

మూడుమునకలేస్తే దీర్ఘాయుష్షు! తిరుమల శ్రీవారి లీలలు అన్నీ ఇన్నీ కావు. స్వామివారు నెలవై ఉన్న తిరుమలలో భక్తులకే తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి. స్వామి వారి ఆలయానికి కుడివైపున ఉన్న పుష్కరిణికి ఎన్నో యేళ్ల చరిత్ర ఉంది. స్వామివారి తెప్పోత్సవాలన్నీ ఈ పుష్కరిణి నుంచే జరుగుతుంటుంది. ప్రతి యేడాది తెప్పోత్సవాలు జరిగే సమయంలో వేలాది మంది భక్తులు తిలకిస్తుంటారు. అలాంటి పుష్కరిణిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన తొమ్మిది తీర్థాలున్నాయి. శ్రీవారి పుష్కరిణిలో కుబేర తీర్థం, గాలవతీర్థం, మార్కండేయ తీర్థం, అగ్నితీర్థం, యమతీర్థం, వశిష్ట తీర్థం, వరుణ తీర్థం, వాయు తీర్థం, సరస్వతి తీర్థం ఇలా మొత్తం ఏడు తీర్థాలున్నాయి. అసలు తీర్థాలకు ఉన్న ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం. కుబేర తీర్థం.. శ్రీవారి పుష్కరిణిలో ఉత్తరాన ధనద తీర్థం ఉంది. ఈ తీర్థాన్ని కుబేరుడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే ఇది కుబేర తీర్థం అని కూడా పిలువబడుతోంది. ఈ తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే చాలు సర్వపాపాలు నశించడమే కాదు ధన, ధాన్యాది సంపదలన్నీ సంప్రాప్తిస్తాయి. గాలవ తీర్థం.. స్వామి పుష్కరిణిలో ఈశాన్య భాగంలో గాలవ తీర్థం ఉంది. ఇది గాలవ మహర్షిచే నిర్మితమైంది. ఈ భాగంలోని తీర్థాన్ని త్రాగినా, లేదా ఇందులో స్నానం చేసినా ఇహ, పర సుఖాలు రెండూ సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. మార్కండేయ తీర్థం... శ్రీనివాసుని పుష్కరిణిలో తూర్పు భాగంలో మార్కండేయ మహర్షి నిర్మించిందే మార్కండేయ తీర్థం. ఇక్కడ స్నానం చేస్తే మానవులకు దీర్ఘాయుస్సు కలుగుతుంది. అగ్ని తీర్థం - యమతీర్థం... వేంకటాచలం మీది స్వామి పుష్కరిణిలో ఆగ్నేయమూలలో అగ్ని దేవునిచే స్థాపించబడిన ఆగ్నేయ తీర్థం ఉంది. ఇందులో స్నానం చేసినట్లయితే పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే యమతీర్థం దక్షిణ భాగంలో ఉంది. ఈ తీర్థంలో స్నానం చేస్తే మానవునికి నరక బాధ తప్పుతుంది. వసిష్ట తీర్థం... వసిష్ట మహర్షిచే నైరృతి దిశలో నిర్మింపబడిన వసిష్ట తీర్థం కూడా ఈ స్వామి పుష్కరిణిలో భాగంగానే ఆవిర్భవించింది. ఈ తీర్థంలో స్నానం చేస్తే తీవ్రమైన అప్పుల బాధలు తొలగుతాయి. వరుణతీర్థం - వాయుతీర్థం.. స్వామి వారి పుష్కరిణిలో పడమట వరుణతీర్థం, వాయుమూలన వాయుతీర్థంలు ఉన్నాయి. ఈ తీర్థాలు ముక్తిని కలిగిస్తాయి. సరస్వతి తీర్థం... కలియుగ వైకుంఠుని పుష్కరిణి మధ్య భాగంలో మహాపాతకాలను నాశనం చేసేటటువంటి సరస్వతి తీర్థం ఉంది. ఈ తొమ్మిది తీర్థాలలో ఒకేరోజున స్నానం చేసిన తర్వాత స్వామి పుష్కరిణికి దక్షిణ తీర్థంలో కొలువై ఉన్న శ్రీనివాస భగవానుని దర్శనం చేసుకున్న మానవునికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అంటే మోక్షం కలుగుతుంది. స్వామి వారి పుష్కరిణి స్నానం, శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం, విష్ణు సహస్ర నామ పారాయణం ఈ మూడు కార్యాలు అత్యంత ఉత్తమమైన తప ఫలాన్ని కలిగిస్తాయి. అందువల్ల తొమ్మిది తీర్థాల నెలవుగా ఉన్న స్వామి పుష్కరిణిలో తప్పక స్నానం చేస్తుంటారు భక్తులు. ఆ తర్వాత అక్కడే ఉన్న శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకుంటుంటారు. అలా ఒకవేళ చేయకపోతే ఆ క్షేత్రంలో ఎన్ని సేవలు చేసినప్పటికీ అవన్నీ ఈ నిష్ఫలాలే అవుతాయని పురాణాలు చెబుతున్నాయి. వేంకటాచలం మీది ఈ స్వామి పుష్కరిణి ఒకానొకప్పుడు దశరథ మహారాజు సేవించుకుని సంతానాన్ని పొందాడు. ఆ తర్వాత శ్రీరామ చంద్రుడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని రావణాసురుని చేత అపహరింపబడిన సీతాదేవిని పొందాడు. ప్రస్తుతం అయితే తీర్థాలన్నీ పుష్కరిణిలోనే ఉన్నాయి. పుష్కరిణిలో మూడుసార్లు మునకేస్తే చాలు సర్వం శుభమే... అయితే మీరు కూడా స్వామివారి పుష్కరిణిలో పుణ్య స్నానం చేస్తారా!

సింగ‌రేణి కాల‌రీస్ ఎడ్యుకేష‌నల్ సొసైటీలో

 ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :టీచింగ్ స్టాఫ్‌-44, నాన్ టీచింగ్ స్టాఫ్‌-19, క్లాస్‌-4 ఎంప్లాయీస్‌-15.
ఖాళీలు :78
అర్హత :ప‌దోత‌ర‌గ‌తి(క్లాస్‌-4), సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ , బీఈడీ, ఎంఫిల్‌/ పీహెచ్‌డీ & నెట్‌/ స‌్లెట్ అర్హ‌త‌, అనుభ‌వం.
వయసు :18-44ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం :రూ. 12,000-40,000/-
ఎంపిక విధానం:టెస్ట్‌/ డెమో క‌మ్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం :ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:నవంబర్ 17, 2020,
దరఖాస్తులకు చివరితేది:డిసెంబర్ 7, 2020.
వెబ్సైట్:Click Here
నోటిఫికేషన్:Click Here

TTD News


డిసెంబ‌రులో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

- డిసెంబ‌రు 14 నుండి జ‌న‌వ‌రి 7వ తేదీ వ‌ర‌కు అధ్య‌య‌నోత్స‌వాలు.

- డిసెంబ‌రు 16న ధ‌నుర్మాసం ప్రారంభం.

- డిసెంబ‌రు 20న సుబ్ర‌మ‌ణ్య‌ష‌ష్టి.

- డిసెంబ‌రు 24న శ్రీ‌వారి స‌న్నిధిన చిన్న‌సాత్తుమొర‌.

- డిసెంబ‌రు 25న వైకుంఠ ఏకాద‌శి.

- డిసెంబ‌రు 26న వైకుంఠ ద్వాద‌శి, స్వామి పుష్క‌రిణితీర్థ ముక్కోటి.

- డిసెంబ‌రు 29న ద‌త్త జ‌యంతి.

- డిసెంబ‌రు 30న ప్ర‌ణ‌య క‌ల‌హోత్స‌వం.

వైఎస్సార్ పెళ్లికానుక లక్ష్యం | YSR Pelli Kanuka

రాష్ట్రములోని నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల వివాహ కార్యక్రమము భారం కాకుండా మరియు పెళ్లి కుమార్తె పెళ్లి అయి అత్త వారింటికి వెళ్ళిన తరువాత కూడా అభద్రతా భావంతో ఉండకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారు పెళ్లి కానుక పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లకు ఆర్ధిక సహాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక, బాల్య వివాహాలు నిర్మూలించేందుకు మరియు వివాహం రిజిస్ట్రేషన్‌ చెయ్యడం ద్వారా వధువుకి రక్షణ కల్పించడం ''వైఎస్సార్ పెళ్ళికానుక'' రూప కల్పన ముఖ్య ఉద్దేశ్యం."

పథక మార్గదర్శకాలు

1. మండల సమాఖ్య / మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.

2. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.

3. వివాహానికి ముందే సాయం మొత్తంలో 20 శాతం పెళ్లికుమార్తె బ్యాంకు ఖాతాలో వేస్తారు.

4. వివాహమయ్యాక మిగతా మొత్తాన్ని జమ చేస్తారు.

5. అనంతరం వివాహ ధ్రువీకరణ పత్రం ఇస్తారు.




వైఎస్సార్ పెళ్ళికానుక అర్హతలు👇

అర్హతలు (వధూవరులిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారయితే)

👉వధువు మరియు వరుడు ఇద్దరూ ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి

👉వధువు మరియు వరుడు ఇద్దరూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి

👉వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధారు కార్డు కలిగి ఉండాలి.

👉వధువు తప్పనిసరిగా తెల్ల రేషను కార్డు కలిగి ఉండాలి

👉వవాహ తేది నాటికీ వధువుకు 18 సంవత్సరములు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను.

👉కేవలం మొదటిసారి వివాహము చేసుకొనే వారు మాత్రమే ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనవచ్చును

👉వవాహము తప్పనిసరిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో మాత్రమే జరుగవలెను.

అర్హతలు (వధువు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెంది ఉండి వరుడు ఇతర రాష్ట్రాలకు (తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, చతీస్ ఘడ్ & ఒడిస్సా) చెందినవారయితే

👉వధువు ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి

👉వధువు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి

👉వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధారు కార్డు కలిగి ఉండాలి.

👉వధువు తప్పనిసరిగా తెల్ల రేషను కార్డు కలిగి ఉండాలి

👉వవాహ తేది నాటికీ వధువుకు 18 సంవత్సరములు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను.

👉కవలం మొదటిసారి వివాహము చేసుకొనే వారు మాత్రమే ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు.

👉అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనవచ్చును

👉వవాహము తప్పనిసరిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో మాత్రమే జరుగవలెను



కావలసిన ధ్రువీకరణ పత్రములు👇


👉కులము / కమ్యూనిటి మీ-సేవ చే జారి చేయబడిన నేటివిటీ, కమ్యూనిటి మరియు జనన ధృవీకరణ పత్రము (మీ- సేవ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్)

👉వయస్సు యస్.యస్.సి సర్టిఫికేట్: 2004 వ సంవత్సరము మరియు ఆ తరువాత పదవ తరగతి పాసయిన వారికీ (లేదా) ఇంటిగ్రేటెడ్ మీ -సేవ సర్టిఫికేట్

👉ఆదాయము (వధువుకి మాత్రమే) తెల్ల రేషను కార్డు/ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్

👉నవాసము ప్రజా సాధికార సర్వే నందు నమోదు

👉అంగవైకల్యము సదరం సర్టిఫికేట్ (కనీసం 40% గా ఉండి శాశ్వత అంగవైకల్యం అయి ఉండాలి)

👉వతంతువు
 ఆధార్ నెంబర్ ఆధారముగా పింఛను డేటాతో పరిశీలిస్తారు
 వితంతువు అయి ఉండి పింఛను పొందకపోతే లేదా ఫించను డేటాలో వివరాలు లేకపోతే వ్యక్తిగత ధృవీకరణ

👉భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు ఎ.పి.బి.ఒ.సి.డబ్ల్యూ.డబ్ల్యూ.బి చే జారీ చేయబడిన కార్మికుని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్/గుర్తింపు కార్డు కలిగి ఉండాలి



ప్రోత్సాహకం👇

👉వైఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.సి) సాంఘిక సంక్షేమ శాఖ 40,000/-

👉వఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.సి కులాంతర) సాంఘిక సంక్షేమ శాఖ 75,000/-

👉వఎస్సార్ పెళ్ళికానుక (గిరి పుత్రిక) గిరిజన సంక్షేమ శాఖ 50,000/-

👉వఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.టి కులాంతర) గిరిజన సంక్షేమ శాఖ 75,000/-

👉వఎస్సార్ పెళ్ళికానుక (బి.సి) బి.సి సంక్షేమ శాఖ 35,000/-
6 వైఎస్సార్ పెళ్ళికానుక (బి.సి కులాంతర) బి.సి సంక్షేమ శాఖ 50,000/-

👉 వఎస్సార్ పెళ్ళికానుక (దుల్హన్) మైనారిటీ సంక్షేమ శాఖ 50,000/-

👉వఎస్సార్ పెళ్ళికానుక (దివ్యంగులు) దివ్యంగులు సంక్షేమ శాఖ 1,00,000/-

👉 వఎస్సార్ పెళ్ళికానుక (APBOCWWB) ఆంధ్రప్రదేశ్ భవనములు మరియు ఇతర నిర్మాణ రంగములోని కార్మిక సంక్షేమ సంస్థ, కార్మిక సంక్షేమ శాఖ 20,000/-


Recent

FREE JEE MAINS MOCK EXAM ONLINE

JEE Mains Mock Test (Physics, Chemistry, Maths) JEE Mains Mock Test Pr...