వైఎస్సార్ పెళ్లికానుక లక్ష్యం | YSR Pelli Kanuka

రాష్ట్రములోని నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల వివాహ కార్యక్రమము భారం కాకుండా మరియు పెళ్లి కుమార్తె పెళ్లి అయి అత్త వారింటికి వెళ్ళిన తరువాత కూడా అభద్రతా భావంతో ఉండకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారు పెళ్లి కానుక పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లకు ఆర్ధిక సహాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక, బాల్య వివాహాలు నిర్మూలించేందుకు మరియు వివాహం రిజిస్ట్రేషన్‌ చెయ్యడం ద్వారా వధువుకి రక్షణ కల్పించడం ''వైఎస్సార్ పెళ్ళికానుక'' రూప కల్పన ముఖ్య ఉద్దేశ్యం."

పథక మార్గదర్శకాలు

1. మండల సమాఖ్య / మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.

2. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.

3. వివాహానికి ముందే సాయం మొత్తంలో 20 శాతం పెళ్లికుమార్తె బ్యాంకు ఖాతాలో వేస్తారు.

4. వివాహమయ్యాక మిగతా మొత్తాన్ని జమ చేస్తారు.

5. అనంతరం వివాహ ధ్రువీకరణ పత్రం ఇస్తారు.




వైఎస్సార్ పెళ్ళికానుక అర్హతలు👇

అర్హతలు (వధూవరులిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారయితే)

👉వధువు మరియు వరుడు ఇద్దరూ ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి

👉వధువు మరియు వరుడు ఇద్దరూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి

👉వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధారు కార్డు కలిగి ఉండాలి.

👉వధువు తప్పనిసరిగా తెల్ల రేషను కార్డు కలిగి ఉండాలి

👉వవాహ తేది నాటికీ వధువుకు 18 సంవత్సరములు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను.

👉కేవలం మొదటిసారి వివాహము చేసుకొనే వారు మాత్రమే ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనవచ్చును

👉వవాహము తప్పనిసరిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో మాత్రమే జరుగవలెను.

అర్హతలు (వధువు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెంది ఉండి వరుడు ఇతర రాష్ట్రాలకు (తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, చతీస్ ఘడ్ & ఒడిస్సా) చెందినవారయితే

👉వధువు ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి

👉వధువు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి

👉వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధారు కార్డు కలిగి ఉండాలి.

👉వధువు తప్పనిసరిగా తెల్ల రేషను కార్డు కలిగి ఉండాలి

👉వవాహ తేది నాటికీ వధువుకు 18 సంవత్సరములు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను.

👉కవలం మొదటిసారి వివాహము చేసుకొనే వారు మాత్రమే ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు.

👉అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనవచ్చును

👉వవాహము తప్పనిసరిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో మాత్రమే జరుగవలెను



కావలసిన ధ్రువీకరణ పత్రములు👇


👉కులము / కమ్యూనిటి మీ-సేవ చే జారి చేయబడిన నేటివిటీ, కమ్యూనిటి మరియు జనన ధృవీకరణ పత్రము (మీ- సేవ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్)

👉వయస్సు యస్.యస్.సి సర్టిఫికేట్: 2004 వ సంవత్సరము మరియు ఆ తరువాత పదవ తరగతి పాసయిన వారికీ (లేదా) ఇంటిగ్రేటెడ్ మీ -సేవ సర్టిఫికేట్

👉ఆదాయము (వధువుకి మాత్రమే) తెల్ల రేషను కార్డు/ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్

👉నవాసము ప్రజా సాధికార సర్వే నందు నమోదు

👉అంగవైకల్యము సదరం సర్టిఫికేట్ (కనీసం 40% గా ఉండి శాశ్వత అంగవైకల్యం అయి ఉండాలి)

👉వతంతువు
 ఆధార్ నెంబర్ ఆధారముగా పింఛను డేటాతో పరిశీలిస్తారు
 వితంతువు అయి ఉండి పింఛను పొందకపోతే లేదా ఫించను డేటాలో వివరాలు లేకపోతే వ్యక్తిగత ధృవీకరణ

👉భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు ఎ.పి.బి.ఒ.సి.డబ్ల్యూ.డబ్ల్యూ.బి చే జారీ చేయబడిన కార్మికుని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్/గుర్తింపు కార్డు కలిగి ఉండాలి



ప్రోత్సాహకం👇

👉వైఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.సి) సాంఘిక సంక్షేమ శాఖ 40,000/-

👉వఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.సి కులాంతర) సాంఘిక సంక్షేమ శాఖ 75,000/-

👉వఎస్సార్ పెళ్ళికానుక (గిరి పుత్రిక) గిరిజన సంక్షేమ శాఖ 50,000/-

👉వఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.టి కులాంతర) గిరిజన సంక్షేమ శాఖ 75,000/-

👉వఎస్సార్ పెళ్ళికానుక (బి.సి) బి.సి సంక్షేమ శాఖ 35,000/-
6 వైఎస్సార్ పెళ్ళికానుక (బి.సి కులాంతర) బి.సి సంక్షేమ శాఖ 50,000/-

👉 వఎస్సార్ పెళ్ళికానుక (దుల్హన్) మైనారిటీ సంక్షేమ శాఖ 50,000/-

👉వఎస్సార్ పెళ్ళికానుక (దివ్యంగులు) దివ్యంగులు సంక్షేమ శాఖ 1,00,000/-

👉 వఎస్సార్ పెళ్ళికానుక (APBOCWWB) ఆంధ్రప్రదేశ్ భవనములు మరియు ఇతర నిర్మాణ రంగములోని కార్మిక సంక్షేమ సంస్థ, కార్మిక సంక్షేమ శాఖ 20,000/-


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

శ్రీ సత్యసాయి జిల్లా, మిషన్ వాత్సల్య పథకం కింద చిల్డ్రన్స్ హోమ్, ధర్మవరం మరియు హిందూపూర్ రిక్రూట్‌మెంట్. Recruitment of Children Home, Dharmavaram and Hindupur Under Mission Vatsalya Scheme, Sri Sathya Sai Dist.

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)