30, నవంబర్ 2020, సోమవారం

హిందూపురం జిల్లా ఆస్పత్రిలో సోమవారం నుండి రోగులకు అందుబాటులో డయాలసిస్ సేవలు

- జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

గతంలో పూర్తి స్థాయి  కోవిడ్ ఆస్పత్రిగా వున్న నేపథ్యంలో   ప్రైవేట్   ఆస్పత్రికి డయాలసిస్ యూనిట్ మార్పు

ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గిన నేపథ్యంలో  హిందూపురం జిల్లా ఆస్పత్రి లో  డయాలసిస్ యూనిట్ తిరిగి ప్రారంభం

అనంతపురం, నవంబర్ 30:  హిందూపురం జిల్లా ఆస్పత్రిలో  సోమవారం నుండి రోగులకు   డయాలసిస్ సేవలు అందుబాటులోకి తెచ్చామని   జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు.. గతంలో హిందూపురంలో కోవిడ్ కేసులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు హిందూపురం జిల్లా ఆస్పత్రిని పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా చేయడం వల్ల,  డయాలసిస్ యూనిట్ ను ప్రైవేట్ ఆస్పత్రికి మార్చడం జరిగిందన్నారు.  ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గిన నేపథ్యంలో,  డయాలసిస్ యూనిట్ ను  తిరిగి హిందూ పురం జిల్లా ఆస్పత్రికి తరలించి,   సోమవారం నుండి   రోగులకు డయాలసిస్ సేవలను   అందుబాటులోకి తెచ్చామన్నారు.. ప్రజలు ఈ మార్పును గమనించి, హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో యధావిధిగా  డయాలసిస్ సేవలను వినియోగించుకోవాల్సిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు..


Issued by AD,I&PR,ATP

కామెంట్‌లు లేవు: