news
డీఈడీ విద్యార్థులకు పరీక్షలు ఈనాడు, అమరావతి: డీఈడీ-2020-22 బ్యాచ్ విద్యార్థులకు నాలుగో సెమిస్టర్ పరీక్షలు డిసెంబరు 12 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. 2019-21 బ్యాచ్లో అనుత్తీర్ణులైన విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావొచ్చని వెల్లడించారు. డీఈడీ-2021-23 బ్యాచ్ రెగ్యులర్ విద్యార్థులకు జనవరి 23 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. భాష పండితు(ఎల్పీటీ)లకు థియరీ పరీక్షలను జనవరి 23 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆన్లైన్లో డిగ్రీ పరీక్షల హాల్ టికెట్లు ఎస్కేయూ: ఎస్కేయూ పరిధిలోని డిగ్రీ అడ్వాన్స్డ్ ఐదవ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు జ్ఞానభూమి పోర్టల్ లో అందుబాటులో ఉంచినట్లు పరీక్షల విభాగం సంచాలకులు రమణ తెలిపారు. 20 కేంద్రాల్లో 5,802 మంది పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పీజీ పరీక్షలు ప్రారంభం ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఎస్కేయూతో పాటు 20 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవ