news
డీఈడీ విద్యార్థులకు పరీక్షలు
ఈనాడు, అమరావతి: డీఈడీ-2020-22 బ్యాచ్ విద్యార్థులకు నాలుగో సెమిస్టర్ పరీక్షలు డిసెంబరు 12 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. 2019-21 బ్యాచ్లో అనుత్తీర్ణులైన విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావొచ్చని వెల్లడించారు. డీఈడీ-2021-23 బ్యాచ్ రెగ్యులర్ విద్యార్థులకు జనవరి 23 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. భాష పండితు(ఎల్పీటీ)లకు థియరీ పరీక్షలను జనవరి 23 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
ఆన్లైన్లో డిగ్రీ పరీక్షల హాల్ టికెట్లు
ఎస్కేయూ: ఎస్కేయూ పరిధిలోని డిగ్రీ అడ్వాన్స్డ్ ఐదవ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు జ్ఞానభూమి పోర్టల్ లో అందుబాటులో ఉంచినట్లు పరీక్షల విభాగం సంచాలకులు రమణ తెలిపారు. 20 కేంద్రాల్లో 5,802 మంది పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
పీజీ పరీక్షలు ప్రారంభం ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఎస్కేయూతో పాటు 20 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ కేంద్రా లను తనిఖీ చేశారు.
29 నుంచి డిగ్రీ ఐదో సెమిస్టర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఐదో సెమిస్టర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కె. శ్రీరాములు నాయక్ తెలిపారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలోని 20 డిగ్రీ కళాశాలల్లో ఈ పరీక్షలు నిర్వహి స్తామన్నారు. మొత్తం 5,802 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. హాల్టికెట్లు జ్ఞానభూమి పోర్టల్లో అందుబాటులో ఉంచామన్నారు.
ఎలక్ట్రికల్ కోర్సులో నైపుణ్య శిక్షణ
అనంతపురం సప్తగిరి సర్కిల్: నిరుద్యోగ యువతకు ఎలక్ట్రికల్ కోర్సులో 45 రోజుల నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 18-35 ఏళ్ల లోపు ఉండి, 5వ తరగతి, ఇంటర్ (పాస్/ఫెయిల్) వారు అర్హులన్నారు. 85000 74757, 7780752418 లో సంప్రదించాలన్నారు.
సీఈటీ, నీట్ క్కు ఉచిత శిక్షణ
పావగడ: స్థానిక గురుకుల విద్యా సంస్థలో నిర్వహిస్తున్న సీఈటీ, నీట్ పోటీ పరీక్షల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి ఎన్ సీ నాగభూషణ గురువారం తెలిపారు. విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగుతాయన్నారు. 9448024739 నంబర్కు సంప్రదించాలన్నారు.
త్వరలో రామగిరిలో నైపుణ్య శిక్షణ కళాశాల
హిందూపురం: హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం రామగిరి మండలంలోని వైటీసీ శిక్షణ సెంటర్లో నైపుణ్య శిక్షణ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి అబ్దుల్ ఖయ్యాం తెలిపారు. బీటెక్, డిప్లమా పూర్తి చేసిన నిరుద్యోగులకు వీఎల్ఎస్ఐ డిజైన్ ఇంజినీర్, ఎంబెడెడ్ ప్రోడెట్ డిజైన్ ఇంజినీర్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామ న్నారు. బ్యాచ్కు 30 మంది చొప్పున ప్రారంభిస్తున్నామని, ఆసక్తి కల్గిన యువత ఫోన్ 7989888299కు సంప్రదించి పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
కామెంట్‌లు