ఉద్యోగాలు | నాబార్డ్ బిజినెస్ అనలిస్టులు | బీఐఎస్‌లో యంగ్ ప్రొఫెషనల్స్ | ఏపీలో సీనియర్ రెసిడెంట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో 1,289 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
  నాబార్డ్ బిజినెస్ అనలిస్టులు  మహారాష్ట్ర ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) వివిధ ఒప్పంద ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  ఖాళీలు:  ఈటీఎల్ డెవలపర్:  01 డేటా సైంటిస్ట్:  02 సీనియర్ బిజినెస్ అనలిస్టు:  01 బిజినెస్ అనలిస్టు:  01 యూఐ/యూఎక్స్ డెవలపర్:  01 డేటా మేనేజ్మెంట్ స్పెషలిస్ట్:  01 ప్రాజెక్ట్ మేనేజర్ (అప్లికేషన్ మేనేజ్మెంట్):  01 సీనియర్ అనలిస్టు (నెట్‌వర్క్/ఎసీడబ్ల్యూఏఎన్ ఆపరేషన్స్):  01 సీనియర్ అనలిస్టు (సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్):  01  అర్హతలు:  సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంటెక్/ఎంసీఏ లేదా పీజీతో పాటు అనుభవం అవసరం.  వేతనం:  ఈటీఎల్ డెవలపర్, యూఐ/యూఎక్స్ డెవలపర్: రూ. 12-18 లక్షలు డేటా సైంటిస్ట్: రూ. 18-24 లక్షలు సీనియర్ బిజినెస్ అనలిస్టు: రూ. 12-15 లక్షలు ప్రాజెక్ట్ మేనేజర్: రూ. 36 లక్షలు  వయో పరిమితి:  ఈటీఎల్ డెవలపర్, డేటా సైంటిస్ట్: 25-40 ఏళ్లు బిజినెస్ అనలిస్టులు: 24-35 ఏళ్లు ప్రాజెక్ట్ మేనేజర్: 35-55 ఏళ్లు  ఎంపిక విధానం:  ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ.  దరఖాస్తు ఫీజు:  ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు: రూ. 150; ఇతరులు: రూ. 850.  దరఖా...