శిక్షణకు పేర్లు నమోదు చేసుకోండి
గుంతకల్లుటౌన్, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): చేతివృత్తులపై శిక్షణ పొందేందుకు పేర్లను నమోదు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి మార్గదర్శకాల ప్రకారం ఒక కుంటుంబం ఒక వ్యాపార వేత్త వాక్టూ వర్క్ లో భాగంగా మహిళా సంఘాలలోని సభ్యులకు కానీ, వారి కుటుం బసభ్యుల్లో ఎవరైనా ఒకరికి కానీ ఏసీ, రీఫ్రైజరేటర్,వాషింగ్్మషన్, వాటర్ పూరిఫైర్,గీజర్, వడ్రంగి, ఫ్లంబింగ్, విద్యుత్, సెలూన్, బ్యుటీషియ న్ కోర్సులకు శిక్షణ ఇస్తారన్నారు. జనవరి4లోపు మున్సిపల్ కార్యాల యంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9493536176, 9493536504 కు సంప్రదించాలన్నారు.
కామెంట్‌లు