Kittur Sainik School: కిత్తూరు రాణి చెన్నమ్మ బాలికల సైనిక పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలు
Kittur Sainik School: కిత్తూరు రాణి చెన్నమ్మ బాలికల సైనిక పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలు కర్ణాటక రాష్ట్రం కిత్తూరులోని కిత్తూరు రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ ఫర్ గర్ల్స్- 2025-26 విద్యా సంవత్సరానికి ఆరోతరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అర్హతగల ఐదో తరగతి చదువుతున్న బాలికలు అక్టోబర్ 24- డిసెంబర్ 15 తేదీల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ‘ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్’ ద్వారా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ పాఠశాలలో ప్రవేశం పొందిన బాలికలు 12వ తరగతి(సైన్స్ స్ట్రీం) వరకు చదువుకోవచ్చు. సైనిక్/ మిలిటరీ స్కూల్స్ నిబంధనల ప్రకారం సీబీఎస్‌ఈ విధానంలో బోధన ఉంటుంది. అడ్మిషన్ వివరాలు... * కిత్తూరు రాణి చెన్నమ్మ గురుకుల బాలికల సైనిక పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలు అర్హత: గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి. నిర్దిష్ట శారీర ప్రమాణాలు తప్పనిసరి. వయసు: విద్యార్థినులు 2025 జూన్ 1 నాటికి పదేళ్లు న...