Gemini Internet
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
*🌻అమరావతి/అనంతపురం, మే 17(ఆంధ్రజ్యోతి*): ఈఏపీసెట్‌లో ఇంటర్ వెయిటేజీ పూర్తిగా ఎత్తివేసినట్లు సెట్ చైర్మన్, జేఎన్‌టీయూ వీసీ రంగజనార్దన్ తెలిపారు. అనంతపురంలోని జేఎన్‌టీయూలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఈఏపీసెట్-2022)లో ఇంటర్మీడియెట్ మార్కుల వెయిటేజీని ఎత్తివేశామన్నారు. ఈ నేపథ్యంలో ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయించనున్నట్టు చెప్పారు. గతంలో ఇంటర్ మార్కులకు 25ు, ఈఏపీసెట్ మార్కులకు 75ు వెయిటేజీ ఆధారంగా విద్యార్థులకు ర్యాంకులు కేటాయించేవారని తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో గత విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదని, అందరినీ పాస్ చేశారని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని.. జూలైలో నిర్వహించే ఈఏపీసెట్‌లో ఇంటర్ వెయిటేజీని రద్దుచేశామని, సెట్‌లో వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు కేటాయించనున్నట్టు వివరించారు. కాగా, ఇదే విషయంపై ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్ ప్రేమ్‌కుమార్ సైతం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Gemini Internet
రాష్ట్రంలో అంధుల ఆశ్రమ పాఠశాలలు, బధిరుల ఆశ్రమ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్టు రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుడు బి.రవిప్రకాష్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో అంధుల ఆశ్రమ పాఠశాలలు, మూడు ప్రాంతాలలో బధిరుల ఆశ్రమ పాఠశాలలతో పాటు బధిరుల ఆశ్రమ జూనియర్ కళాశాల నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వీటిలో 462 ఖాళీలు ఉన్నాయన్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హత గల వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నామని, సంబంధిత పాఠశాలలో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. దరఖాస్తు చేయడానికి విద్యార్ధి వయసు 5 సంవత్సరాల పైబడి ఉండాలని, ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు మూడు జత చేసి పంపాలని కోరారు.
*అర్హత గల విద్యార్థులు కింద తెలిపిన ఫోన్ నెంబర్లకు సంప్రదించాల్సిందిగా కోరారు.👇👇*
విజయనగరం - 8317548039, 9440359775
విశాఖపట్నం - 9494914959, 9014456753
హిందూపురం - 7702227917, 7780524716
విజయనగరం - 9000013640, 9963809120
బాపట్ల - 9441943071, 9985837919
ఒంగోలు - 9440437629, 7013268255
Gemini Internet
*🌻ఈనాడు, అమరావతి*:పదో తరగతి పరీక్షా ఫలితాలను జూన్ 10లోపు ఇవ్వనున్నారు. మూల్యాంకనం ఈ నెల చివరి నాటికి పూర్తి చేయనున్నారు. మూల్యాంకనం అనం తరం ఇతర కార్యకలాపాలను ఐదారు రోజుల్లో పూర్తి చేసి, ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. పదో తరగతి మార్కుల ఆధారంగానే ఈ ఏడాది ట్రిపులస్ఐటీల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు.
Gemini Internet