18, మే 2022, బుధవారం

*బధిరుల (గుడ్డి / మూగ / చెవిటి) పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం✍️📚* | హిందూపురంలోని పాఠశాలలో కూడా ప్రవేశాలు ప్రారంభం

రాష్ట్రంలో అంధుల ఆశ్రమ పాఠశాలలు, బధిరుల ఆశ్రమ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్టు రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుడు బి.రవిప్రకాష్‌ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో అంధుల ఆశ్రమ పాఠశాలలు, మూడు ప్రాంతాలలో బధిరుల ఆశ్రమ పాఠశాలలతో పాటు బధిరుల ఆశ్రమ జూనియర్‌ కళాశాల నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వీటిలో 462 ఖాళీలు ఉన్నాయన్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హత గల వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నామని, సంబంధిత పాఠశాలలో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. దరఖాస్తు చేయడానికి విద్యార్ధి వయసు 5 సంవత్సరాల పైబడి ఉండాలని, ఆధార్‌ కార్డు, సదరం సర్టిఫికెట్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు మూడు జత చేసి పంపాలని కోరారు.

*అర్హత గల విద్యార్థులు కింద తెలిపిన ఫోన్‌ నెంబర్లకు సంప్రదించాల్సిందిగా కోరారు.👇👇*
విజయనగరం - 8317548039, 9440359775
విశాఖపట్నం - 9494914959, 9014456753
హిందూపురం - 7702227917, 7780524716
విజయనగరం - 9000013640, 9963809120
బాపట్ల     - 9441943071, 9985837919
ఒంగోలు   - 9440437629, 7013268255

Gemini Internet

కామెంట్‌లు లేవు: