18, మే 2022, బుధవారం

*ఈఏపీసెట్‌లో ఇంటర్‌* *వెయుటేజీ ఎత్తివేత✍️📚* *సెట్‌ మార్కుల ఆధారంగానే ర్యాంకులు*

*🌻అమరావతి/అనంతపురం, మే 17(ఆంధ్రజ్యోతి*): ఈఏపీసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ పూర్తిగా ఎత్తివేసినట్లు సెట్‌ చైర్మన్‌, జేఎన్‌టీయూ వీసీ రంగజనార్దన్‌ తెలిపారు. అనంతపురంలోని జేఎన్‌టీయూలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఈఏపీసెట్‌-2022)లో ఇంటర్మీడియెట్‌ మార్కుల వెయిటేజీని ఎత్తివేశామన్నారు. ఈ నేపథ్యంలో ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయించనున్నట్టు చెప్పారు. గతంలో ఇంటర్‌ మార్కులకు 25ు, ఈఏపీసెట్‌ మార్కులకు 75ు వెయిటేజీ ఆధారంగా విద్యార్థులకు ర్యాంకులు కేటాయించేవారని తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో గత విద్యా సంవత్సరంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదని, అందరినీ పాస్‌ చేశారని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని.. జూలైలో నిర్వహించే ఈఏపీసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీని రద్దుచేశామని, సెట్‌లో వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు కేటాయించనున్నట్టు వివరించారు. కాగా, ఇదే విషయంపై ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ సైతం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Gemini Internet

కామెంట్‌లు లేవు: