24, మే 2021, సోమవారం

వెస్టర్న్‌ రైల్వేలో 3591 అప్రెంటిస్‌ ఖాళీలు..ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 24.06.2021

 



భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్టర్న్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs అప్రెంటిస్‌ ఖాళీల సంఖ్య: 3591
ట్రేడులు:
ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, వైర్‌మెన్‌ తదితరాలు.
అర్హత: మెట్రిక్యులేషన్‌/పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉండాలి.
వయసు: 04.06.2021 నాటికి 15–24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది.

ఎంపిక విధానం: పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులేదు. ఇతరులు రూ.100 చెల్లించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.05.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 24.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.rrc-wr.com

కామెంట్‌లు లేవు: