DFCCIL Recruitment | భారీ సంఖ్యలో రైల్వే ఉద్యోగాల భర్తీ, 1074 రైల్వే పోస్టులు
భారీ స్థాయిలో జీతం లభించే ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనీ ప్రకటనలో పొందుపరిచారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది | మే 23, 2021 |
CBT పరీక్ష నిర్వహణ తేది | జూన్ 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ మేనేజర్ (సివిల్ ) | 31 |
జూనియర్ మేనేజర్ (ఆపరేషన్స్ & BID) | 77 |
జూనియర్ మేనేజర్ (మెకానికల్ ) | 3 |
ఎగ్జిక్యూటివ్ (సివిల్ ) | 73 |
ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్ ) | 42 |
ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ & టెలి కమ్యూనికేషన్ ) | 87 |
ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్స్ & BD) | 237 |
ఎగ్జిక్యూటివ్ (మెకానికల్ ) | 3 |
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్ ) | 135 |
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ &టెలి కమ్యూనికేషన్ ) | 147 |
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్ & BD) | 225 |
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్ ) | 14 |
అర్హతలు :
జూనియర్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బాచిలర్ డిగ్రీ /బీఈ /బీ. టెక్ /ఎంబీఏ /పీజీడీజీఏ /పీజీడీబీఎం /పీజీడీఎం మొదలైన కోర్సులను పూర్తి చేయవలెను.
సంబంధిత విభాగాలలో డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
సంబంధిత విభాగాలలో 10వ తరగతి మరియు ఐటీఐ కోర్సులను కంప్లీట్ చేసిన వారు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవచ్చు .
ఈ పోస్టుల విద్యా అర్హతలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు .
ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 15 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు .
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానం లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు ఉద్యోగాల విభాగాలను అనుసరించి 700 – 1000 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను .
ఎస్సీ /ఎస్టీ మరియు అన్ని కేటగిరిలకు చెందిన మహిళా అభ్యర్థులకు ఎటువంటి ధరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు (CBT) మరియు ఇంటర్వ్యూల విధానాల ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 25,500 రూపాయలు నుండి 1,95,000 రూపాయలు వరకూ లభించనున్నాయి.
కామెంట్‌లు