31, మే 2021, సోమవారం

LIC Associate Jobs 2021 | LIC లో అసోసియేట్ ఉద్యోగాలు | ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జూన్ 7, 2021.

 

LIC లో అసోసియేట్ ఉద్యోగాలు ,జీతం 6 నుంచి 9 లక్షల వరకూ 

 

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఇరు తెలుగు రాష్ట్రముల అభ్యర్థులకు ఒక మంచి వార్త.

 

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు , ఉద్యోగాల  భర్తీలో భాగంగా అర్హులైన అభ్యర్ధులనుండి అప్లికేషన్స్ స్వీకరిస్తున్నట్లు LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ముంబై ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపినది.

 

LIC లో భర్తీ చేయనున్న కేంద్ర ప్రభుత్వ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

 

భారీ స్థాయిలో జీతములు లభించే పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటనలో పొందుపరిచారు.

 

పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీ, కోల్ కత్తా, బెంగుళూరు, భోపాల్, ముంబై నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

 

 

ముఖ్యమైన తేదీలు   :

 

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది    :   జూన్ 7, 2021.

 

విభాగాల వారీగా ఖాళీలు :

 

అసోసియేట్స్               -      6

 

అర్హతలు :

 

పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 55% మార్కులతో మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ /రూరల్ మేనేజ్ మెంట్ కోర్సులను పూర్తి చేయవలెను.

 

సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని మరియు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

 

ఉద్యోగాల భర్తీకి సంబంధించిన విద్యా అర్హతలు, వయసు మొదలైన మరింత  ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీసియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.

 

వయసు :

 

23 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు నని ప్రకటనలో తెలిపారు.

 

దరఖాస్తు విధానం :

 

ఆన్లైన్ విధానంలో పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

 

దరఖాస్తు ఫీజు :

 

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

 

ఎంపిక విధానం :

 

ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానములలో పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

 

జీతం :

 

పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 6 లక్షల రూపాయలు నుండి 9 లక్షల రూపాయలు వరకు జీతం అందనుంది.

 

Website

 

Notification 

 

కామెంట్‌లు లేవు: