💥 Mandatory Aadhar UPDATE : Doubts Clarifications కొత్తగా వచ్చిన ఆధార్ అప్డేషన్ అంశంపై సందేహాలు - సమాధానాలు✒️
Q: ఆధార్ అప్డేట్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకేనా లేక దేశంలో అందరికీ ఉందా? A: సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరూ వారి ఆధార్‌లో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. Q: కొత్తగా ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎందుకు? A: 2010 నుంచి 2016 వరకు ఆధార్ ఇచ్చేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోకుండా ఆధార్ ఇవ్వబడింది. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న బోగస్ ఆధార్ కార్డులను ఏరివేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఆధార్ ఉన్న పౌరుడు వారి పేరు & అడ్రస్‌ను సరైన ఆధారాలతో ధృవీకరించుకోవాలి. Q: డాక్యుమెంట్ అప్డేట్ ఎవరు చేసుకోవాలి? A: 2010 నుంచి 2016 మధ్యలో ఆధార్ తీసుకుని 2016 తర్వాత ఆధార్‌లో పేరు గానీ అడ్రస్ గానీ మార్చుకోకపోతే వాళ్లు తప్పనిసరిగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. Q: 2016 తర్వాత నేను నా ఫోటో & డేట్ అఫ్ బర్త్‌ను మార్చుకున్నాను. ఇప్పుడు నేను మరలా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలినా? A: 2016 తర్వాత పేరు అడ్రస్ మార్చుకోలేదు కాబట్టి మీరు డాక్యుమెంట్ అప్డేట్ చేయించుకోవాల్సిందే. Q: డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది? A: డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోని వారందరి ఆధార్‌లు 2023