EPF ఈపీఎఫ్ అధిక పింఛనుకు ఎవరు అర్హులు? | పింఛనుదారులు, ఉద్యోగుల్లో ఎన్నో సందేహాలు నివృత్తికి ఈపీఎస్-95 సేవాగ్రూపు ప్రయత్నం.
ఈనాడు, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పు అమలులో భాగంగా ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చి.. అధిక వేతనం పొందుతూ ఆ మేరకు ఈపీఎఫ్ చందాచెల్లిస్తున్న ఉద్యోగులకు ఈపీఎఫ్వో అధిక పింఛను ప్రయోజనాలు కల్పించనుంది. ఈ తీర్పు అమలు కోసం ఇప్పటికే మూడు సర్క్యులర్లను ఈపీఎఫ్వో జారీ చేసింది. తాజా నిబంధనల ప్రకారం ఎవరు అర్హులు? ఎవరికి అధిక పింఛను ప్రయోజనం వర్తిస్తుంది? తదితర సందేహాలు వస్తున్నాయి. ఈ మేరకు పింఛనుదారులు, ఉద్యోగులు, కార్మికులు ప్రాంతీయ కార్యాలయాలకు చేరుకుని వివరాలు అడుగుతున్నారు. ఉద్యోగుల పింఛను పథకం-95పై తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో నిబంధనలపై పింఛనుదారుల సమాఖ్య అడిగిన సందేహాలను ఈపీఎఫ్ వో-కోచి ప్రాంతీయ కార్యాలయం నివృత్తి చేసింది. ఈ వివరాలను ఈపీ ఎస్-95 సేవా గ్రూపు క్రోడీకరించింది. 2014 సెప్టెంబరు 1కి ముందు పదవీవిరమణ చేసిన ఉద్యోగులు, కార్మికులు అధిక పింఛను కోసం దరఖాస్తుచేయవచ్చా? అయితే ఆయా ఉద్యోగులు తాము సర్వీసులో ఉన్నపుడు ఈపీఎస్ చట్టం 11(3) నిబంధన కింద అధిక పింఛను యజమానితో కోసం కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చి ఉండాలి. ఈ ఉమ్మడి ఆప్షన్ ను ఈపీఎఫ్ వో తిరస్కరించి ఉండాలి. ఈ అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హులు. ? 2014 సెప్టెంబరు 1న, ఆ తరువాత పదవీ విరమణ చేసిన వారు దరఖాస్తుకు అర్హులా? అధిక పింఛను కోసం ఇప్పుడు ఆప్షన్ ఇవ్వవచ్చు. అయితే 2014 సెప్టెంబరు 1కి ముందు అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్ ఇవ్వకుండా, ఈపీఎఫ్ గరిష్ఠ వేతనపరిమితి (బేసిక్+డీఏ)కి మించి వేతనం పొందుతూ వాస్తవిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లిస్తూ ఉండాలి. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఈ అవకాశం వినియోగించుకోవచ్చా? 2014 సెప్టెంబరు 1కి ముందు సభ్యులుగా చేరి, ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే అధికవేతనం పై ఈపీఎఫ్ చందా చెల్లించాలి. 2014 సెప్టెంబరు 1 తరువాత చేరిన వారు అధిక పింఛను సదుపాయం వినియోగించుకోలేరు.అధిక పింఛనుకు ఆప్షన్ ఇచ్చినపుడు ఈపీ ? ఎఫ్ చట్టంలో పేరా 26(6)నిబంధన కింద ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలన్నారు. ఇది ఏమిటి? చట్టంలోని పేరా 26(6) ప్రకారం గరిష్ఠ పరిమితికి మించి వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లించేందుకు ఈ నిబంధన వెసులుబాటు కల్పిస్తుంది. అధికవేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లించేందుకు ముందుగా ఉద్యోగి, యజమాని కలిసి సంయుక్తంగా ఈపీఎఫ్వోకు దరఖాస్తు చేయాలి. ఈ దరఖాస్తును ఏపీఎఫ్సీ ర్యాంకు. ఆపై అధికారి ఆమోదించాలి. తాజాగా అధిక పింఛను కోరుకున్న ఉద్యోగులు 26(6) కింద ఆప్షన్ కచ్చితంగా ఇచ్చి ఉండాలి. ఉద్యోగుల పింఛనునిధి చట్టంలోని పేరా 11(3),11(4) ఏం చెబుతోంది? ఉద్యోగుల పింఛను నిధి (ఈపీఎస్) చట్టం 1995ని 2014లో సవరించారు. ఈ చట్ట సవరణకు ముందు 11(3) నిబంధన ప్రకారం 1995 నవంబరు 16 నుంచి ఉద్యోగి పొందుతున్న వాస్తవిక వేతనం గరిష్ఠ వేతన పరిమితికి మించి ఉన్నప్పుడు మూలవేతనం, డీఏ మొత్తంలో 8.33 శాతాన్ని ఈపీఎస్ కు చందా చెల్లించాలి. ఈ మేరకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలి. ఈ సెప్టెంబరు 1 తరువాత ఈపీఎస్ చట్టసవరణ ద్వారా నిబంధనను 2014 తొలగించింది. అయితే వాస్తవిక వేతనంపై గతంలో 8.33 శాతం చందా చెల్లిస్తున్న వారు ఆరు నెలల్లోగా మరోసారి ఆప్షన్ ఇవ్వాలని 11(4) కింద అవకాశమిచ్చింది. ఈ గడువును మరో ఆరు నెలల పాటు ఈపీఎఫ్ వో అప్పట్లో పొడిగించింది. ఈపీఎస్ చట్టం –95 పేరా నం.11(3) కింద ఇచ్చిన ఆప్షనన్ను చట్టసవరణ అనంతరం పేరా నం.11(4) కింద ఏడాదిలోగా పునరుద్దరించలేదు. వారికి ఇప్పుడు అవకాశం ఉంటుందా? చట్టసవరణ తరువాత ఏడాదిలోగా 11(4) కింద ఉమ్మడి ఆప్షన్ ఇవ్వని ఉద్యోగులు ఆ అవకాశాన్ని సొంతంగా వదులుకున్నట్లు అవుతుంది. ఈ నేప థ్యంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అధిక పింఛనుకు ప్రస్తుతం ఉమ్మడి ఆప్షన్ అవకాశం లేదు.
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు