15, ఫిబ్రవరి 2023, బుధవారం

JEE Mains 2nd Session Update ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ సెషన్-2కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్కు దాదాపు వారం రోజుల పాటు విద్యార్థుల నిరీక్షణ తర్వాత దరఖాస్తులు చేసుకొనేందుకు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో ప్రత్యేక విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి 7 నుంచే ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. అయితే, ఆలస్యానికి కారణాలను వెల్లడించకుండా వెబ్సైట్లో లింకు ఉంచినప్పుడే దరఖాస్తు చేసుకోండి అన్నట్టుగా ఎన్టీఏ వ్యవహరించడంపై నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
ఏప్రిల్లో పరీక్షలు
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15న దరఖాస్తులను ఆహ్వానిస్తూ వెబ్సైట్లో లింక్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త అభ్యర్థులతో పాటు మొదటి సెషన్ పరీక్ష రాసిన విద్యార్థులు కూడా రెండో విడత పరీక్షకు దరఖాస్తులు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6, 8, 10, 11, 12 తేదీల్లో జరగనుండగా.. ఏప్రిల్ 13, 15 తేదీలను ఎన్టీఏ రిజర్వు చేసింది. దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి (ఫిబ్రవరి 15) నుంచి మొదలై మార్చి 12 రాత్రి 9గంటల వరకు కొనసాగనుంది. పరీక్ష రుసుం చెల్లించేందుకు మార్చి 12న రాత్రి 11.50 గంటల వరకు అవకాశం ఉంటుందని ఎన్టీఏ ఓ ప్రకటనలో తెలిపింది.
రికార్డు స్థాయిలో దరఖాస్తులు.....
పరీక్ష నిర్వహించే సిటీ, అడ్మిట్ కార్డుల డౌన్ లోడింగ్, ఫలితాల ప్రకటించే తేదీలకు ముందుగానే వెల్లడిస్తామని.. ఆ అప్డేట్ ను తమ అధికారిక వెబ్సైట్లో ఎప్పటికప్పుడు చూసుకోవాలని సూచించింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగిన జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షను రికార్డు స్థాయిలో ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు రాసిన విషయం తెలిసిందే. ఇటీవల వీటి ఫలితాలు విడుదల కాగా.. 20 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించినట్టు ఎన్డీఏ వెల్లడించింది. అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తులు చేయొద్దని.. అలా చేస్తే అక్రమ మార్గం అనుసరిస్తున్నట్టుగా పరిగణించాల్సి వస్తుందని ఎన్డీఏ హెచ్చరించింది. జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష తర్వాత ఆల్ ఇండియా ర్యాంకుల్ని ప్రకటిస్తారు. వీరిలో టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్డ్ పరీక్ష రాసేందుకు అవకాశం కలుగుతుంది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎన్ఐఐటీలు, తదితర ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలవుతుంది. 

Website

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: