నాణ్యమైన బోధన.. నెలనెలా స్టైపెండ్ | వీటిలో యూజీ, పీజీ స్థాయిలో కోర్సులు అందిస్తున్నారు. వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఈ సంస్థలో చేరిన విద్యార్థులు నాణ్యమైన బోధనతోపాటు ప్రతి నెలా స్టైపెండ్ అందుకోవచ్చు.

విశిష్ట విద్యకు.. ఐఎస్ఐ
దేశంలో పేరున్న సంస్థల్లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) ముఖ్యమైంది. ఇక్కడున్న మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులు అత్యున్నతమైనవి. ఐఎస్ఐకి కోల్కతా, దిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తేజ్ పూర్, గిరిడీల్లో క్యాంపస్లున్నాయి. వీటిలో యూజీ, పీజీ స్థాయిలో కోర్సులు అందిస్తున్నారు. వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఈ సంస్థలో చేరిన విద్యార్థులు నాణ్యమైన బోధనతోపాటు ప్రతి నెలా స్టైపెండ్ అందుకోవచ్చు.
ఐఎస్ఐ ప్రాంగణాల్లో బీస్టాట్, ఎంస్టాట్, బీ మ్యాథ్స్, ఎం మ్యాథ్స్, ఎంటెక్, పీజీ డిప్లొమా, పీహెచ్ కోర్సులు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తిచేసినవారు, చివరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూతో కోర్సులోకి తీసుకుంటారు. పరీక్షపై అవగాహన పొందడానికి సిలబస్, మాదిరి ప్రశ్నలు ఐఎస్ఐ వెబ్సైట్లో ఉంచారు.
ఈ సంస్థల్లో డిగ్రీ కోర్సుల్లో చేరినవారికి నెలకు రూ.5 వేలు, పీజీలకు రూ.8 వేలు, ఎంటెక్ కోర్సులకు రూ.12,400 స్టైపెండ్ చెల్లిస్తారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్పు (జీఆర్ఎఫ్)కు ఎంపికైతే నెలకు రూ.31,000+హెన్ఆర్ఎ, సీనియర్ రిసెర్చ్ ఫెలోషిప్పులకు రూ.35,000+హెచ్ఐర్ఎ అందిస్తారు. అన్ని కోర్సుల విద్యార్థులకూ ఏటా కాంటింజెన్సీ గ్రాంటు దక్కుతుంది. తక్కువ ధరకు వసతి, భోజన సౌకర్యాలున్నాయి. కోర్సు చివరలో క్యాంపస్ నియామకాలు చేపడతారు. ఈ సంస్థల్లో పీజీ కోర్సులు పూర్తిచేసుకున్న వారికి ఆకర్షణీయ వేతనాలతో అవకాశాలు లభిస్తున్నాయి.

ఎవరు అర్హులు?
* బీస్టాట్: మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ చదివి ఉండాలి. కోల్కతా క్యాంపస్లో ఆనర్స్ విధానంలో కోర్సు నిర్వహిస్తున్నారు. వ్యవధి మూడేళ్లు. 63 సీట్లు.
- బీమ్యాథ్స్ : మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేయాలి. బెంగళూరు క్యాంపస్లో ఆనర్స్ విధానంలో కోర్సు నిర్వహిస్తున్నారు. వ్యవధి మూడేళ్లు. 63 సీట్లు.
పై రెండు కోర్సుల్లోనూ విద్యార్థినుల కోసం అదనంగా 16 చొప్పున సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయించారు.
జేఆర్ఎఫ్..
స్టాటిస్టిక్స్ 7, మ్యాథ్స్ 10, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ 12, కంప్యూటర్ సైన్స్ 20, క్వాలిటీ రిలయబిలిటీ అండ్ ఆపరేషన్స్ రిసెర్చ్ 3, ఫిజిక్స్ అండ్ అప్లయిడ్ మ్యాథ్స్ 10, సోషియాలజీ 1, బయలాజికల్ సైన్స్ 1, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ 1 చొప్పున జీఆర్ఎఫ్లో అవకాశం లభిస్తుంది. కోల్కతా, ఢిల్లీ, బంగళూరు, చెన్నై, గిరిడీ క్యాంపస్ ఈ కోర్సులు ఉన్నాయి. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఎస్ఆర్ఎఫీకి తీసుకుంటారు. సంబంధిత విభాగాల్లో పీజీ పూర్తిచేసుకున్నవారు జేఆర్ఎఫ్కు అర్హులు. ఎన్బోహెఎం/సీఎస్ఐఆర్/యూజీసీ నెట్ స్కోరుతో అవకాశం కల్పిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తులు: మార్చి 7 నుంచి ఏప్రిల్ 5 వరకు స్వీకరిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1500, జనరల్ మహిళలకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఓబీసీ (ఎన్సీఎల్)లకు రూ.750
పరీక్ష: మే 14న.

వెబ్సైట్: https://www.isical.ac.in/

పీజీ కోర్సులు
వీటిని రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నారు.
* మాస్టర్ అఫ్ స్టాటిస్టిక్స్: స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఏదైనా మూడేళ్ల డిగ్రీ లేదా బీఈ/ బీటెక్ చదివుండాలి. ఈ కోర్సు మొదటి సంవత్సరం కోల్కతా, చెన్నై, దిల్లీల్లో, ద్వితీయ సంవత్సరం కోల్కతా క్యాంపస్లో అందిస్తారు. 38 సీట్లు ఉన్నాయి.
- మాస్టర్ ఆఫ్ మ్యాథమాటిక్స్: మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఏదైనా మూడేళ్ల డిగ్రీ లేదా బీఈ/ బీటెక్ కోర్సు పూర్తిచేసినవారు అర్హులు. ఈ కోర్సు కోల్కతా క్యాంపస్లో అందిస్తున్నారు. 36 సీట్లు ఉన్నాయి.
* ఎంఎస్ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్: ఏదైనా డిగ్రీ కోర్సుతోపాటు ఇంటర్లో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివుండాలి. కోలకతా, దిల్లీ క్యాంపస్ అందిస్తున్నారు. ఢిల్లీలో 35, కోల్కతాలో 21 సీట్లు ఉన్నాయి.
* ఎంఎస్ క్వాలిటీ మేనేజ్మెంట్ సైన్సెస్: మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీలో చదివుండాలి లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్ పూర్తిచేయాలి. 20 సీట్లు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్ క్యాంపస్ నిర్వహిస్తున్నారు. తొలి రెండు సెమిస్టర్లు బెంగళూరు, మూడో సెమిస్టరు హైదరాబాద్ క్యాంపస్లో చదువుతారు.
* ఎంఎస్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బెంగళూరు క్యాంపస్లో అందిస్తున్నారు. 12 సీట్లు ఉన్నాయి.
ఎంటెక్ కోర్సులు
* కంప్యూటర్ సైన్స్(సీఎస్) : బీఈ/ బీటెక్ లేదా ఇంటర్లో మ్యాథ్స్ ఏదైనా పీజీ చదివినవారు అర్హులు. కోల్కతా క్యాంపస్లో కోర్సు అందిస్తున్నారు. ఐఎస్ఐ పరీక్షతో 30, గేట్ స్కోర్తో 15 మందికి అవకాశం కల్పిస్తారు.
* క్రిష్టాలజీ అండ్ సెక్యూరిటీ (సీఆర్ఎస్) : బీఈ/ బీటెక్ లేదా ఇంటర్లో మ్యాథ్స్ ఏదైనా పీజీ చదివినవారు అర్హులు. కోల్కతా క్యాంపస్లో కోర్సు అందిస్తున్నారు. ఐఎస్ఐ పరీక్షతో 20, గేట్ స్కోర్తో
5 మందిని చేర్చుకుంటారు.
- క్వాలిటీ, రిలయబిలిటీ అండ్ ఆపరేషన్ రిసెర్చ్ (క్యూఆర్ఎఆర్): స్టాటిస్టిక్స్ మాస్టర్ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు ఇంటర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివుండాలి. లేదా మ్యాథ్స్ మాస్టర్ డిగ్రీతోపాటు డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఇంటర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివుండాలి. లేదా బీరు/ బీటెక్ ఉండాలి. కోల్కతా క్యాంపస్లో కోర్సు అందుబాటులో ఉంది. 32 సీట్లు ఉన్నాయి.
పీజీ డిప్లొమాలు
ఈ కోర్సుల వ్యవధి ఏడాది.
* స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ ఎనలిటిక్స్ మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ/ బీటెక్ చదివినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవది ఏడాది. చెన్నై, తేజ్పూర్ క్యాంపస్ అందిస్తున్నారు. చెన్నైలో 25, తేజూర్లో 18 సీట్లు ఉన్నాయి.
* పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ మేనేజ్మెంట్ విత్ స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ ఎనలిటిక్స్ (పీజీడీఏఆర్ఎస్ఎంఏ) ఏడాది కోర్సును గిరిడీ (జార్ఖండ్) క్యాంపస్లో అందిస్తున్నారు. ఇందులో 18 సీట్లు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఇంటర్లో మ్యాథ్స్ లేదా స్టాటిస్టిక్స్ చదివుండాలి. ఈ కోర్సుకు స్టైపెండ్ లేదు.
* ఈ సంస్థ అప్లయిడ్ స్టాటిస్టిక్స్లో గత ఏడాది నుంచి పీజీ డిప్లొమా కోర్సు ఆన్లైన్లో కోర్స్ ఎరాతో కలిసి అందిస్తోంది. ఇంటర్లో మ్యాథ్స్ చదివి, ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షతో ఎంపికలు ఉంటాయి. 30 సీట్లు ఉన్నాయి.
బిజినెస్ ఎనలిటిక్స్..
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ), కోలకతా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఖరగ్పూర్; ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), కోల్కతా - ఈ మూడు సంస్థలూ కలిసి పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ ఎనలిటిక్స్ కోర్సు రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. ప్రపంచంలోనే మేటి బిజినెస్ ఎనలిటిక్స్ కోర్సుల్లో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది. ఒక్కో సంస్థలో 6 నెలలపాటు కోర్సు చదువుకుంటారు. చివరి 6 నెలలు ఇంటర్న్ షిప్ ఉంటుంది. కోర్సు ఫీజు రూ. 25 లక్షలు. రుణ సౌకర్యం ఉంది. గత ఏడాది ఇక్కడ కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులు గరిష్ఠంగా 42.5 లక్షలు, సగటున రూ.30 లక్షల వార్షిక వేతనంతో అవకాశాలు అందుకున్నారు. అర్హత: 60 శాతం మార్కులతో  బీటెక్/ఎంటెక్/ ఎమ్మెస్సీ/ఎంకాం/ ఎంబీఏ పూర్తిచేసుకున్న వారు అర్హులు. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతోన్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: పరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూ, ఇంటర్లో సాధించిన మార్కులు, పని అనుభవం ఏటికి కొన్నేసి పాయింట్లు కేటాయించి కోర్సులోకి తీసుకుంటారు. పరీక్షకు 45, ఇంటర్వ్యూ 40, ఇంటర్ మార్కులకు 8, పని అనుభవానికి 7 శాతం చొప్పున వెయిటేజీ ఉంది.
పరీక్ష ఇలాః 150 మార్కులకు దీన్ని నిర్వహిస్తారు. 50 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. వెర్బల్ ఎబిలిటీ నుంచి 15, లాజికల్ రీజనింగ్ 5, డేటా ఇంటర్ ప్రిటేషన్ అండ్ డేటా విజువలైజేషన్ 5, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు.
చివరి తేదీ: ఫిబ్రవరి 24లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మాక్ టెస్టు: మార్చి 16, 17 తేదీల్లో.
పరీక్ష తేదీ: మార్చి 26

వెబ్సైట్: https://www.isical.ac.in/~pgdba/

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.