26, ఫిబ్రవరి 2023, ఆదివారం

*దివ్యాంగ విద్యార్థులకు**భత్యం విడుదల✍️📚*

*🌻ఈనాడు, అమరావతి*: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు గృహ ఆధారిత విద్యా భత్యం, రవాణా భత్యం కింద రూ.5.29 కోట్లు విడుదల చేసి నట్లు సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్పీడీ) సురేశ్కు మార్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమ చేస్తామని వెల్లడించారు. ఇంటి వద్ద చదువుకుంటున్న 1-8 తరగతులకు చెందిన 5,559 మంది విద్యార్థులకు రూ. 3వేల చొప్పున అందిస్తున్నారు. పాఠశాల లకు వెళ్లలేని ప్రత్యేక అవసరాల పిల్లలకు సహిత విద్యా వనరుల ఉపాధ్యాయులు వెళ్లి ఇంటి వద్దే బోధన చేస్తున్నారని, 1-10 తరగతులు చదు వుతున్న విద్యార్థులకు రవాణా భత్యం అందిస్తున్నామని ఎస్పీడీ వెల్లడిం చారు. ప్రాథమిక స్థాయిలో 9,886 మంది, మాధ్యమిక స్థాయిలో 2,220 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. దివ్యాంగ బాలికలకు రూ. 2వేల చొప్పున ఉపకారవేతనం ఇస్తున్నామని తెలిపారు.

కామెంట్‌లు లేవు: