ఇంటర్ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల
మొదటి, రెండవ సంవత్సర అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మొత్తం 1,28,705 మంది ఉత్తీర్ణత
*విజయవాడ : ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఆగస్టులో నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎం.వి. శేషగిరిబాబు విడుదల చేశారు. తాడేపల్లి ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో మంగళవారం సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు సంబందించిన దరఖాస్తులను సెప్టెంబర్ 10వ తేదీ వరకూ స్వీకరిస్తామని చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన మార్కుల మెమోలు అధికారిక వెబ్ సైట్ లో పొందుపరుస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శేషగిరి బాబు మాట్లాడుతూ ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సర ఫలితాల్లో జనరల్ లో 35 శాతం, ఒకేషనల్ లో 42 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జనరల్ లో జనరల్ లో 33 శాతం, ఒకేషనల్ లో 46 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అడ్వాన్సడ్ సప్లిమెంటరీ-2022 పరీక్షలను ఆగస్టు 3వ తేది నుండి 12వ తేది వరకూ నిర్వహించగా, 13వ తేదీ నుండి 26 తేదీ వరకూ స్పాట్ వాల్యూయేషన్ జరిపామన్నారు. ఈ పరీక్షలకు జనరల్ లో 3,28,831 మంది, ఒకేషనల్ లో 37,712 మంది మొత్తం 3,66,543 మంది హాజరయ్యారని తెలిపారు. జనరల్ మొదటి సంవత్సర విద్యార్థులు 1,76,942 మంది హాజరుకాగా 61,410 మంది ఉత్తీర్ణత సాధించగా, రెండవ సంవత్సరానికి 1,51,889 మంది పరీక్షలకు హాజరుకాగా 50,691 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. అలాగే ఒకేషనల్ మొదటి సంవత్సర విద్యార్థులు 18,399 మంది హాజరుకాగా 7,680 మంది ఉత్తీర్ణత సాధించగా, రెండవ సంవత్సరంలో 19,313 మంది హాజరుకాగా 8,924 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మొదటి సంవత్సర ఇంప్రూవ్ మెంట్ కోసం 1,47,164 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 1,28,573 మంది మెరుగైన ఫలితాలను సాధించారని శేషగిరి బాబు తెలిపారు.
ఇంటర్ మీడియట్ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల కోసం www.bie.ap.gov.in, http://examresults.ap.nic.in వెబ్ సైట్లనందు పొందవచ్చునని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఇంటర్ బోర్డు అధికారులు ప్రభాకర రెడ్డి, గౌడ్, సుశీల, తదితరులు పాల్గొన్నారు.
Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి