4, ఆగస్టు 2022, గురువారం

Bank Jobs: ఏదైనా డిగ్రీతో 6432 పోస్టులు

శవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌పీవో/ఎంటీ 2022) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా 6432 పోస్టులు భర్తీచేయనున్నారు.

మొత్తం పోస్టుల సంఖ్య: 6432
బ్యాంకుల వారీగా ఖాళీలు: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా–535, కెనరా బ్యాంక్‌–2500, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌–500, పంజాబ్‌ సింద్‌ బ్యాంక్‌–253, యూకో బ్యాంక్‌ –550, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా–2094.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు.
వయసు: 01.08.2022 నాటికి 20 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం

  • ప్రిలిమినరీ, మెయిన్‌ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
  • ప్రిలిమినరీ పరీక్ష 100ప్రశ్నలు–100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్షా సమయం 60 నిమిషాలు. హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో పరీక్ష జరుగుతుంది.
  • మెయిన్స్‌ పరీక్ష 155 ప్రశ్నలు–200 మార్కులకు ఉంటుంది. ఇందులో రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, డేటా అనాలసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 180 నిమిషాలు. పరీక్ష ఇంగ్లిష్, హిందీ మా«ధ్యమాల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ భాషలో లెటర్‌ రైటింగ్, ఏదైనా అంశంపై వ్యాసం రాయాల్సి ఉంటుంది. దీనికి 25 మార్కులు ఉంటాయి. పరీక్షా సమయం 30 నిమిషాలు ఉంటుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 02.08.2022
  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 22.08.2022
  • ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబర్‌ 2022
  • ఆన్‌లైన్‌ మెయిన్‌ ఎగ్జామ్‌: నవంబర్‌ 2022
  • ఇంటర్వ్యూలు: జనవరి/ఫిబ్రవరి 2023
  • తుది నియామకాలు: ఏప్రిల్‌ 2023
  • వెబ్‌సైట్‌: https://www.ibps.in/

Gemini Internet

కామెంట్‌లు లేవు: