15, ఆగస్టు 2022, సోమవారం

Govt Scholarships: పేద ఎస్సీ విద్యార్థులకు పోస్ట్‌–మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు.. రూ.2,500 నుంచి రూ.13,500 వరకు స్కాలర్‌షిప్‌

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2022–23 సంవత్సరానికి సంబంధించి అర్హులైన ఎస్సీపేద విద్యార్థులకు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ అందిస్తోంది. పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం రూ.2,500 నుంచి రూ.13,500 వరకు స్కాలర్‌షిప్‌ ఇస్తోంది.

అర్హత

  • ఎస్సీ కేటగిరీకి చెందిన పేద విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌ ఇస్తారు.
  • పదో తరగతి పూర్తిచేసి గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్, ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు.
  • విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు.
  • విద్యార్థులు చేరే సంస్థలకు ప్రభుత్వ గుర్తింపు ఉండాలి.
  • భారతదేశంలో చదివే పిల్లలకే ఈ స్కాలర్‌షిప్‌లు వర్తిస్తాయి.
  • దరఖాస్తుల పరిశీలన, ఎంపిక బాధ్యత రాష్ట్రాల పైనే ఉంటుంది.

స్కాలర్‌షిప్‌ వివరాలు

విద్యా స్థాయిని బట్టి స్కాలర్‌షిప్‌ ఉంటుంది. అవి నాలుగు కేటగిరీలలో ఉంటాయి.
1. గ్రూప్‌ 1 (డిగ్రీ, పీజీ స్థాయి ప్రొఫెషనల్‌ కోర్సులు): డే స్కాలర్‌–రూ.7000, హాస్టల్‌లో ఉండేవారికి–రూ.13,500.
2. గ్రూప్‌ 2 (డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్‌ ప్రొఫెషనల్‌ కోర్సులు): డే స్కాలర్‌–రూ.6500, హాస్టల్‌లో ఉండేవారికి రూ.9500.
3. గ్రూప్‌–3 (గ్రూప్‌ 1, 2 పరిధిలో లేని గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్లు): డే స్కాలర్‌–రూ.3000, హాస్టల్‌లో ఉండేవారికి–రూ.6000.
4. గ్రూప్‌–4 (అన్ని పోస్టు మెట్రిక్యులేషన్, నాన్‌–డిగ్రీ కోర్సులు): డే స్కాలర్‌–రూ.2500, హాస్టల్‌లో ఉండేవారికి–రూ.4000.

  • దివ్యాంగ విద్యార్థులకు 10% అదనపు అలవెన్స్‌ అందుతుంది.

దరఖాస్తు విధానం: అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.రిజిస్ట్రేషన్‌ కోసం పోర్టల్‌ 14.04.2022 నుండి తెరిచి ఉంది.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/

Gemini Internet

కామెంట్‌లు లేవు: