PM YASASVI Scheme 2022: పాఠశాల విద్యార్థులకు ఎన్‌టీఏ–యశస్వి స్కాలర్‌షిప్ | ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.08.2022
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్(YASASVI) ప్రవేశ పరీక్ష–2022 కోసం ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌టీ పాఠశాల విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ స్కాలర్‌షిప్‌లను భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ 15,000 మంది విద్యార్థులకు అందజేస్తుంది.
అర్హత
- ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో తొమ్మిది, పదకొండు తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
- ఇతర వెనుకబడిన తరగతి(ఓబీసీ), ఆర్థికంగా వెనుకబడిన తరగతి(ఈబీసీ), సం చార, పాక్షిక–సంచార తెగల డీ–నోటిఫైడ్ తెగల(డీఎన్‌టీ)కు చెందిన విద్యార్థులే అర్హులు.
- తల్లిదండ్రులు/సంరక్షకుల వార్షిక ఆదాయం రూ. 2.5లక్షలకు మించకూడదు.
పరీక్షా విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)విధానంలో జరుగుతుంది.ప్రవేశ పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 3గంటలు. పరీక్ష ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో జరుగుతుంది. దేశవ్యాప్తంగా 78 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. అభ్యర్థులు ఎలాంటి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.08.2022
హాల్‌టిక్కెట్‌లు వెలువడే తేది: 05.09.2022
పరీక్ష తేది: 11.09.2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://yet.nta.ac/
కామెంట్‌లు