15, ఆగస్టు 2022, సోమవారం

GATE 2023 Notification: గేట్‌ నోటిఫికేషన్‌ విడుదల | ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 30.09.2022 | ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 07.10.2022

ఐఐటీ కాన్పూర్‌ గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌(గేట్‌)–2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా జాతీయ స్థాయిలో నిర్వహించే ఈపరీక్షలో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ఉన్నతవిద్యతోపాటు పలు ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలను సైతం భర్తీ చేస్తున్నారు. ఐఐటీలు, నిట్‌ వంటి విద్యాసంస్థల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీలో చేరడానికి గేట్‌ స్కోర్‌ తప్పనిసరి. ఈ ఏడాది గేట్‌ పరీక్షను ఐఐటీ కాన్పూర్‌ నిర్వహిస్తోంది.

అర్హతలు: ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం కోర్సు చివరి సంవత్సరం చదు వుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభ తేది: 30.08.2022
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 30.09.2022
ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 07.10.2022
పరీక్ష తేదీలు: 04.02.2023, 05.02.2023, 11.02.2023, 12.02.2023.
పరీక్ష ఫలితాల విడుదల: 16.03.2023

వెబ్‌సైట్‌: https://gate.iitk.ac.in

Gemini Internet

కామెంట్‌లు లేవు: