15, ఆగస్టు 2022, సోమవారం

Jagananna Videshi Vidya Deevena Scheme: అడ్మిషన్‌ పొందితే రూ.50 లక్షలు లేదా 50 శాతం ఫీజు | ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: 30.09.2022

ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖ జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.క్యూఎస్‌ ర్యాంకుల ప్రకారంఉన్నతశ్రేణి 200 విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ కోర్సులు చదవడానికి   అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సహా ఈబీసీ కులాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో ఉత్తీర్ణత ఉండాలి. టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, జీఆర్‌ఈ, జీమ్యాట్, నీట్‌ స్కోర్‌ ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి.
వయసు: 35ఏళ్లకు మించకూడదు.

ఆర్థిక సాయం: వందలోపు ర్యాంకు గల విశ్వవిద్యాలయం, విద్యా సంస్థలో ప్రవేశాలు పొందితే ఫీజు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. 101 నుంచి 200లోపు ర్యాంకు గల విశ్వవిద్యాలయం, విద్యాసంస్థలో అడ్మిషన్‌ పొందితే రూ.50 లక్షలు లేదా 50 శాతం ఫీజు ఏది తక్కువ అయితే దాని ప్రకారం చెల్లిస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: 30.09.2022

వెబ్‌సైట్‌: https://jnanabhumi.ap.gov.in

 

Gemini Internet

కామెంట్‌లు లేవు: