15, ఆగస్టు 2022, సోమవారం

Andhra Pradesh Govt Jobs: 1681 పోస్టులు | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.08.2022


ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లలో సేవలు అందించడానికి ఒప్పంద ప్రాతిపదికన 1681 మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదలచేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 1681
అర్హత: ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ కమ్యూనిటీ హెల్త్‌(సీపీసీహెచ్‌) కోర్సుతో బీఎస్సీ పూర్తిచేయాలి.
వయసు: జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 18నుంచి 35ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ఐదేళ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు పదేళ్లు మినహాయింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్షలో వచ్చిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్ష బీఎస్సీ నర్సింగ్‌ సిలబస్‌ నుంచి 200 ప్రశ్నలకు బహుళైచ్ఛిక విధానంలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష సమయం 3గంటలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.08.2022

వెబ్‌సైట్‌: https://cfw.ap.nic.in/

 

Gemini Internet

కామెంట్‌లు లేవు: