4, ఆగస్టు 2022, గురువారం

SSC Recruitment 2022: హిందీ ట్రాన్స్‌లేటర్‌ కొలువు.. ప్రారంభంలోనే 40వేలకుపైగా వేతనం

భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్‌ గ్రీవెన్సెస్, పెన్షన్‌ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో గ్రూప్‌ బి, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది.

పోస్టుల వివరాలు: జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్లు, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్లు, సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్లు. 
విభాగాలు: సెంట్రల్‌ సెక్రటేరియట్‌ అఫీషియల్‌ లాంగ్వేజ్‌ సర్వీస్, రైల్వే బోర్డు, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ హెడ్‌ క్వార్టర్స్, వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు.
ఖాళీలు: ఖాళీలకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా /సర్టిఫికేట్‌ కోర్సు ఉండాలి. 
వయసు: 18–30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ 
(సీబీఈ–కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌) విధానంలో రెండు పేపర్లుగా పరీక్షను నిర్వహిస్తారు. మొదటి పేపర్‌కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌. రెండో పేపర్‌ ట్రాన్స్‌లేషన్, ఎస్సే రైటింగ్‌గా ఉంటుంది. 

వేతనాలు: వివిధ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌/జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్లకు పే లెవల్‌–6 ప్రకారం –రూ.35,400–1,12,400 వరకు వేతనంగా లభిస్తుంది. అలాగే సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్లు పే లెవల్‌–7 ప్రకారం– రూ.44,900–1,42,400 వరకు వేతనంగా పొందవచ్చు.

ముఖ్యసమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 04.08.2022
ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 05.08.2022
సీబీఈ తేదీ: అక్టోబర్‌ 2022
వెబ్‌సైట్‌: https://ssc.nic.in

Gemini Internet

కామెంట్‌లు లేవు: