14, జులై 2023, శుక్రవారం

RGUKT: ట్రిపుల్‌ఐటీల్లో 64 శాతం సీట్లు బాలికలకే.. * జులై 20నుంచి 25 వరకు ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ * ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ


ఈనాడు, అమరావతి: రాజీవ్‌ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ఐటీల్లో ఈ ఏడాది సైతం బాలుర కంటే బాలికలకు ఎక్కువ సీట్లు లభించాయి. మొత్తం సీట్లలో బాలికలకు 64శాతం దక్కాయి. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో 4,040 సీట్లకు జాబితాను ప్రకటించగా.. బాలికలు 2,585, బాలురు 1,455మంది సీట్లు పొందారు. ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విజయవాడలో గురువారం మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా 10శాతంతో కలిపి 4,400 సీట్లు ఉండగా.. దివ్యాంగులు, ఎన్‌సీసీ, క్రీడలు, స్కౌట్, సైనికోద్యోగుల కోటాకు సంబంధించిన 360 మినహా మిగతా సీట్లకు జాబితాను ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 23,628, ప్రైవేటు బడులకు చెందిన 14,727మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 3,345(82.79%), ప్రైవేటు నుంచి 695(17.20%)మంది సీట్లు పొందారు. ఆగస్టు మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. స్థానికేతర కోటాలో తెలంగాణకు చెందిన 88 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 4శాతం వెయిటేజీ ఇచ్చారు. ఒక్కో సబ్జెక్టుకు నాలుగు మార్కుల చొప్పున అదనంగా 24మార్కులు కలిపారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 10.02%, వైయస్‌ఆర్‌ జిల్లా నుంచి 6.66%, విజయనగరం జిల్లా నుంచి 6.36% మంది ఎంపికయ్యారు. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి 0.23%మంది సీట్లు పొందారు. 


కౌన్సెలింగ్‌ ఇలా..


సీట్లు పొందిన అభ్యర్థులకు క్యాంపస్‌లను కేటాయించేందుకు జులై 20నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. నూజివీడులో జులై 20 నుంచి 21, ఇడుపులపాయ(ఆర్‌కేవ్యాలీ)లో 21-22, ఒంగోలు క్యాంపస్‌కు సంబంధించి ఆర్‌కే వ్యాలీలో 24, 25, శ్రీకాకుళం ఎచ్చెర్ల ప్రాంగణంలో 24-25 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. సైనికోద్యోగులు, ఎన్‌సీసీ, క్రీడలు, స్కౌట్‌ కోటాకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కానందున 360 సీట్లకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 10శాతం సీట్లు అదనంగా భర్తీ చేస్తారు. 


వచ్చే ఏడాది పీహెచ్‌డీ


ఆర్జీయూకేటీలో వచ్చే ఏడాది నుంచి పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను ప్రవేశ పెట్టాలని భావిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఫలితాల విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఐఐటీలాంటి విద్యను అందించేందుకు ఆర్జీయూకేటీని తీసుకొచ్చాం. సీట్లు పొందిన మొదటి 20 మందిలో ప్రభుత్వ బడుల నుంచి వచ్చిన విద్యార్థులే ఉన్నారు. బోధనాసిబ్బంది నియామకాలు, మౌలికసదుపాయాలు కల్పించాల్సి ఉంది. వీటిని ఏడాదిలో పూర్తి చేస్తాం. ఒంగోలు క్యాంపస్‌ నిర్మించాల్సి ఉంది. టెండర్లు పిలిచి, పనులను రెండేళ్లలో పూర్తి చేస్తాం’’ అని వెల్లడించారు. ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి మాట్లాడుతూ.. సీట్ల కోసం 38వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని, మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగా జాబితా రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి విజయ్‌కుమార్, డైరెక్టర్లు సంధ్యారాణి, జయరామిరెడ్డి, జగదీశ్వరరావు, జీవీఆర్‌ శ్రీనివాసరావు, ఏఓ గోపాలరాజు పాల్గొన్నారు. 


నూజివీడుకే ప్రాధాన్యం..


ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల్లో మొదటి 20 స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల్లో నలుగురు మినహా మిగతా 16మంది నూజివీడు ప్రాంగణాన్నే ఎంపిక చేసుకున్నారు. నలుగురు ఆర్‌కే వ్యాలీ క్యాంపస్‌కు ఐచ్ఛికం ఇచ్చారు. ఒంగోలు, శ్రీకాకుళం ప్రాంగణాల్లో మౌలికసదుపాయాలు లేకపోవడంతో ఈ రెండింటిలో చేరేందుకు టాపర్లు ఆసక్తి చూపడం లేదు.

మీ స్నేహితులకు watsapp లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves

https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR

అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.

పని చేయు వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు

 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: