16, జులై 2023, ఆదివారం

APPSC: సహాయ ఆచార్యుల భర్తీకి స్క్రీనింగ్‌ పరీక్ష * 2 వేల పోస్టులకు ప్రభుత్వం అనుమతి

విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల (అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించనుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి ఉన్నత విద్యామండలి శనివారం(జులై 15) అన్ని విశ్వవిద్యాలయాల పాలకవర్గ (ఈసీ) సమావేశాలు నిర్వహించింది. ఇప్పటికే 2 వేల సహాయ ఆచార్యుల పోస్టులకు ప్రభుత్వం అనుమతి తెలిపినందున వీటి నియామకాలకు పాటించాల్సిన విధానంపై పాలకవర్గంలో చర్చించారు. ఇటీవల ఉన్నత విద్యామండలి వర్సిటీల్లో బోధన పోస్టుల హేతుబద్ధీకరణ నిర్వహించింది. దీని ప్రకారం కొన్ని పోస్టులు అవసరం కానున్నట్లు గుర్తించారు. వర్సిటీల్లో ఈసారి ఆర్ట్స్‌ సబ్జెక్టుల పోస్టులు తగ్గిపోయే అవకాశం ఉంది. విద్యార్థులు చేరడం లేదని కొన్నిచోట్ల ఆర్ట్స్‌ కోర్సులను మూసివేశారు. సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహణకు విశ్వవిద్యాలయాలు.. ఏపీపీఎస్సీతో ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. సమన్వయ బాధ్యతను ఉన్నత విద్యామండలికి అప్పగించేందుకు ఈసీలో తీర్మానించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, ఆదికవి నన్నయ, కృష్ణా, విక్రమసింహాపురి, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాలకు రెక్టార్లు లేనందున ఇక్కడ ఈసీ తీర్మానాలకు కోరం సరిపోని పరిస్థితి ఏర్పడింది. రాయలసీమ వర్సిటీలో రిజిస్ట్రార్‌ పోస్టు ఖాళీగా ఉండటంతో ఇక్కడా కోరం సమస్య ఏర్పడింది.

* స్క్రీనింగ్‌ పరీక్షలో ఓసీ, ఓబీసీలకు 40%, ఎస్సీ, ఎస్టీలకు 35% మార్కులు రావాలి. పరీక్షతోపాటు అకడమిక్‌ అర్హతలకు వెయిటేజీ ఉంటుంది. ఒక్కో పోస్టుకు నలుగుర్ని మౌఖిక పరీక్షలకు పిలిచే అవకాశం ఉంది.

* అకడమిక్‌ సంబంధించి గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌, ఎంఫిల్‌లో వచ్చిన మార్కులకు వెయిటేజీ ఇస్తారు. పీహెచ్‌డీ, జేఆర్‌ఎఫ్‌తో నెట్‌, స్లెట్‌, నెట్‌కు అదనంగా వెయిటేజీ ఉంటుంది.

* అకడమిక్‌కు 80, పరిశోధనకు 10, బోధన అనుభవానికి 10 చొప్పున మొత్తం 100 మార్కులకు వెయిటేజీ ఉంటుంది. స్క్రీనింగ్‌ పరీక్ష మార్కులతోపాటు అకడమిక్‌ మార్కులను కలిపి మౌఖిక పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

* మౌఖిక పరీక్షను వంద మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో పోస్టుకు నలుగురి చొప్పున పిలిచిన తర్వాత నిర్వహించే మౌఖిక పరీక్ష అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. మౌఖిక పరీక్షకు ఎక్కువ మార్కులు కేటాయించినందున ఇది కీలకంగా మారనుంది.

రిజర్వేషన్లు మొదటికి..

గతంలో వర్సిటీల్లో నియామకాలకు ఆర్ట్స్‌, సైన్స్‌, ఇంజినీరింగ్‌ విభాగాల వారీగా రిజర్వేషన్‌ను అమలు చేయగా.. ఇప్పుడు వర్సిటీ యూనిట్‌గా రిజర్వేషన్‌ అమలు చేయనున్నారు. రిజర్వేషన్‌ మొదటి నుంచి ప్రారంభమవుతుంది. కొత్తగా ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగుల రిజర్వేషన్‌తోపాటు మహిళ రిజర్వేషన్‌లో మార్పు రానుంది. 200 రోస్టర్‌ పాయింట్ల ప్రకారం నిర్వహించనున్నారు.

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves

https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR

అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.

పని చేయు వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు

 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: