11, ఏప్రిల్ 2023, మంగళవారం

20 వరకు కేజీబీవీప్రవేశాలకు గడువు | 352 కేజీబీవీల్లో 6, 7, 8 తరగతుల్లోమిగులు సీట్ల భర్తీ | ఆన్లైన్లో మాత్రమేదరఖాస్తుల స్వీకరణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 352 కస్తూర్బా బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి 6, 7, 8 తరగతుల్లోని మిగులు సీట్ల భర్తీకి సమగ్ర శిక్ష ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 20 వరకుఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనాధలు, బడిబయటి పిల్లలు, బడి మానేసిన వారు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన బాలికలు ఈ సీట్లకు అర్హులు. ఎం పికైన విద్యార్థినులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తారు లేదా సంబంధిత పాఠశాల నోటీసు బోర్డులో కూడా నేరుగా వివరాలు చూసుకోవచ్చు.

కామెంట్‌లు లేవు: