రైతులు 30లోగా ఈ-కేవైసీచేయించుకోండి
కుందుర్పి: పీఎం కిసాన్, రైతు భరోసా తదితర
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే రైతులు
ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవ
సాయ అధికారి మహేష్ సూచించారు. మంగ
ళవారం కుందుర్పి ఆర్బీకేలో ఖరీఫ్ పంటల
సాగు, మట్టి నమూనాల పరీక్షలు, సేంద్రియ
వ్యవసాయ పద్ధతులపై రైతులకు ఆర్బీకే సిబ్బం
దికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈనె
లాఖరులోగా ఈ-కేవైసీ చేయించుకోని రైతులు
ఆయా ఆర్బీకేల్లో లేదా మీసేవా కేంద్రాల్లో చేయిం
చుకోవాలన్నారు. అలాగే పొలాల్లో మట్టి పరీక్షల
అనంతరం వాటి ఫలితాల మేరకు ఖరీఫ్ లో పం
టలు సాగుచేయాలన్నారు. రసాయనిక ఎరువు
లకు స్వస్తి పలికి సేంద్రియ పద్ధతుల్లో పంటలు
సాగుచేస్తే ఆశించిన దిగుబడులు వస్తాయన్నారు.
అలాగే రైతు భరోసా కేంద్రాల్లోని సేవలను
రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన
సూచించారు. కార్యక్రమంలో ఆర్బీకే సిబ్బంది,
రైతులు పాల్గొన్నారు.
కామెంట్‌లు