19, ఏప్రిల్ 2023, బుధవారం

Income Tax Frauds: మోసాలు చేసి బతికే వాళ్లకు ప్రతి దానిలోనూ అవకాశాలు కనిపిస్తూనే ఉంటాయి. పైగా ప్రస్తుతం డిజిటల్ యుగం విసృతంగా వ్యాప్తి చెందిన తరుణంలో అన్ని పనులు ఉన్న చోటు నుంచే పూర్తి చేసుకోవటం పెరిగింది. సైబర్ నేరగాళ్లు వీటిని అదునుగా తీసుకుని కొత్త మోసాలకు పాల్పడుతున్నారు.

పాత ఆర్థిక సంవత్సరం ముగిసిన తరుణంలో చాలా మంది తమ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే కంగారులో ఉన్నారు. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు, ఆధార్ కేవైసీ మోసాలకు పాల్పడిన సైబర్ కేటుగాళ్ల వలలో ఇప్పుడు టాక్స్ పేయర్స్ చిక్కుకుంటున్నారు. అలా డబ్బు పోగొట్టుకుంటున్న ఘటనలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. టాక్స్ ఫైలింగ్‌తో జరభద్రం.. సైబర్ నేరగాళ్ల కొత్త స్కామ్ పన్నులు చెల్లించే వారి వివరాలు తెలుసుకుంటున్న సైబర్ నేరగాళ్లు.. వారికి ఫేక్ ఎస్ఎమ్ఎస్, ఈ-మెయిల్స్ పంపుతున్నారు. 
పాన్, ఆధార్ వంటి వివరాలను వెంటనే అప్ డేట్ చేయాలని లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని నమ్మబలుకుతున్నారు. పొరపాటున వారి మాటలు నమ్మి వారు పంపిన మెసేజీల్లోని లింక్స్ క్లిక్ చేస్తే.. ఒక యాప్ మీ స్మార్ట్ ఫోనులో ఇన్‌స్టాల్ అవుతుంది. అందులో మీ బ్యాంక్ వివరాలు, పాన్, ఆధార్ వంటి కీలక సమాచారానికి సంబంధించి వివరాలను అడుగుతున్నారు. పొరపాటున వాటిని నింపితే ఇక అంతే సంగతులు. 
విలువైన మీ పర్సనల్ సమాచారం సైబర్ మోసగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. అందువల్ల వ్యక్తిగత వివరాలు, సున్నితమైన బ్యాంకింగ్ సమాచారం, పిన్ నంబర్లు వంటి వాటి వివరాలను మోసగాళ్లకు అందకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా అనుమానాస్పత లింక్స్, మెసేజీలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అనుమానం వస్తే ముందుగా మీ బ్యాంకును సంప్రదించటం ఉత్తమం. 
ఎందుకంటే వారు వినియోగదారులను ఎప్పుడూ కీలకమైన వ్యక్తిగత సమాచారాన్ని అడగరు. ఒకవేళ మీకు వచ్చిన మెయిల్స్, మెసేజీలు ఫేక్ అని తేలితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియజేయండి. ఓటీపీలు, సీవీర్ నెంబర్, పాస్ వర్డ్స్, లాగిన్ క్రెడెన్షియల్స్ ఎల్లప్పుడూ సేఫ్‌గా ఉండేలా చూసుకోవటం మిమ్మల్ని సైబర్ నేరాల నుంచి కాపాడుతుందని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. 
 ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: