ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023(ఏపీ పీజీసెట్) షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ ప్రవేశ పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభమై మే 11న ముగియనుంది. ప్రవేశ పరీక్షలు జూన్ 6న ప్రారంభం కానున్నాయి.
17 విశ్వవిద్యాలయాలు.. 145కి పైగా కోర్సులు..
ఏపీ పీజీసెట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న 16 విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 145కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పరీక్ష కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో ఉంటుంది. రాతపరీక్ష (ఎంపీఈడీ మినహా)లో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85% శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయిస్తారు. పీజీసెట్ మూడు కేటగిరీల వారీగా నిర్వహిస్తున్నారు. కేటగిరీ-1లో ఆర్ట్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్; కేటగిరీ-2లో కామర్స్ అండ్ ఎడ్యుకేషన్, కేటగిరీ-3లో సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు.
ప్రవేశాలు పొందే యూనివర్సిటీలు...
ఆంధ్ర యూనివర్సిటీ (విశాఖపట్నం), డా.బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ (శ్రీకాకుళం), శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి), డా.అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ (కర్నూలు), శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ (అనంతపురం), ద్రవిడియన్ యూనివర్సిటీ (కుప్పం), ఆచార్య నాగార్జన యూనివర్సిటీ (గుంటూరు), కృష్ణా యూనివర్సిటీ (మచిలీపట్నం), శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (తిరుపతి), ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ (రాజమహేంద్రవరం), యోగి వేమన యూనివర్సిటీ (కడప), క్లస్టర్ యూనివర్సిటీ (కర్నూలు), రాయలసీమ యూనివర్సిటీ (కర్నూలు), ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ (ఒంగోలు), విక్రమ సింహపురి యూనివర్సిటీ (నెల్లూరు), జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనంతపూర్- ఆయిల్ టెక్నలాజికల్ అండ్ ఫార్మాస్యూటికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (తిరుపతి).
పరీక్ష వివరాలు: పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023 (ఏపీ పీజీసెట్)
పీజీ కోర్సులు: ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే, ఎంఎఐబీఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీటెక్ తదితరాలు.
అర్హత: సంబంధించిన సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా చివరి ఏడాది పరీక్ష రాస్తున్నవారు అర్హులు.
పరీక్ష ఫీజు: జనరల్ కేటగిరీలకు రూ.850; బీసీలకు రూ.750; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.650.
పరీక్ష విధానం: లాంగ్వేజ్ స్పెషలైజేషన్ పేపర్లు మినహా మిగతా అన్ని ప్రశ్న పత్రాలు ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటాయి. పరీక్ష కంప్యూటర్ ఆధారంగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. పరీక్ష 90 నిముషాల వ్యవధితో 100 మార్కులకు జరుగుతుంది. నెగెటివ్ మార్కులు లేవు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టు సంబంధించి డిగ్రీ సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్యమైన తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01-04-2023.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 11-05-2023.
రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ: 21-05-2023.
ప్రవేశ పరీక్షల ప్రారంభం: 06-06-2023.
Notification
https://cets.apsche.ap.gov.in/APPGCET2023/UI/HomePages/Home
------------------------------------------------------------------------
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR
రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును.
Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును.
పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-.
తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును.
జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/-
డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం
EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి