5 రోజుల్లో తేలిక పాటి వర్షాలు
బుక్కరాయసముద్రం: జిల్లాలో రానున్న ఐదు
రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
ఉందని రేకులకుంటలోని ఆచార్య ఎన్జీ రంగా
వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్
సహదేవరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త అశోక్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు పెద్దఎత్తున పెరగవచ్చునని పేర్కొన్నారు. మధ్యాహ్నం 39.8-40.8, రాత్రి 26 -27.1 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపారు.
కామెంట్‌లు