RGUKT: ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ ప్రక్రియ ఇలా.. కౌన్సెలింగ్‌కు ఇవి తప్పనిసరి..
వేంపల్లె : రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలు చదువులో మేటిగా నిలుస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, క్రమశిక్షణ, నాణ్యమైన ఉత్తమ విద్యా బోధనను అందిస్తున్నాయి. ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ ప్రక్రియ ఇలా.. కౌన్సెలింగ్‌కు ఇవి తప్పనిసరి.. సీట్లు ఎన్ని ఉన్నాయంటే.? ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యా బోధనకు నిలయమైన ట్రిపుల్ ఐటీల్లో చదువుతోపాటు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, క్రీడలు, శాస్త్రీయ సంగీతం, నాట్యం, యోగా వంటి వాటిలో శిక్షణ కూడా ఇస్తున్నారు. 2023–24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నాలుగు ట్రిపుల్ ఐటీలలో 4000సీట్లతోపాటు ఈడబ్ల్యూసీ కోటాలో మరో 400 కలిపి మొత్తం 4400 సీట్లు ఉన్నాయి. ఎంత మంది దరఖాస్తు? ట్రిపుల్ ఐటీల ప్రవేశాలకు జూలై 3తో దరఖాస్తుల గడువు ముగిసింది. ఇప్పటివరకు ట్రిపుల్ ఐటీలలో 4400సీట్లకు గానూ 38,490 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఎలా కేటాయిస్తారు? వీటిని రోస్టర్ ప్రకారం భర్తీ చేయడంతో...