AP Polytechnic Admissions: పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి కౌన్సెలింగ్ (Polytechnic Counseling) సమయం సమీపిస్తోంది | విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: కళాశాలల
 ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి 
కౌన్సెలింగ్ (Polytechnic Counseling) సమయం సమీపిస్తోంది. అయినా 
ఇప్పటివరకు పదోతరగతి ఫలితాల్లో పునఃపరిశీలనకు సంబంధించిన మార్కుల వివరాలు 
వెల్లడించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం 
సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో పునఃపరిశీలన, 
రీకౌంటింగ్(Re-Counting)కు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరుగుతోంది. అయినా 
తొలివిడత పరిశీలనకు సంబంధించిన జాబితా విడుదల కాకపోవడంతో మార్కులెన్ని 
వచ్చాయో...ఫలితం ఎంతశాతం ఉందో తెలియడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.
వేలాదిమంది ఎదురుచూపులు.. ఉమ్మడి
 జిల్లావ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులు సవరణ మార్కుల జాబితాల(Marks 
List) కోసం ఎదురు చూస్తున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల 
నుంచి 1,354మంది విద్యార్థులు, ఎన్టీఆర్ జిల్లా నుంచి 2,118 మంది చొప్పున 
తమ మార్కుల పునః పరిశీలన నిమిత్తం నిర్దేశించిన రుసుము(Fee) చెల్లించి 
దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి పరిశీలన ప్రక్రియ కూడా పూర్తై 
నెలదాటి పోయింది.  ఇప్పటివరకు సవరణ మార్కుల జాబితాలు విడుదల చేయక పోవడం 
విమర్శలకు తావిస్తోంది. పదిలో ఉత్తీర్ణత సాధించి పలు సబ్జెక్టుల్లో తక్కువ 
మార్కులు వచ్చినవారితోపాటు ఒకటి రెండు మార్కుల తేడాతో ఫెయిల్ అయిన వారు 
కూడా దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. ప్రస్తుతం చాలామంది వివిధ 
కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశాలు పొందారు. సవరణ మార్కుల జాబితా రాకపోవడం, ఆయా
 కళాశాలల యాజమాన్యాలు అవి కావాలని అడగడంతో పాఠశాలల చుట్టూ ప్రదక్షిణలు 
చేస్తున్నారు.
సమీపిస్తున్న సమయం..
 పదిలో వచ్చిన మార్కులను బట్టి ప్రయివేటు కళాశాలలు విద్యార్థులకు ఫీజు 
రాయితీ ఇస్తున్నాయి. అది పొందాలంటే వారికి వచ్చిన మార్కుల జాబితా కళాశాలలకు
 అందించాల్సి ఉంటుంది. ఉత్తమ ఫలితాలు సాధించినా ఇంకా అదనంగా మార్కులు 
రావాల్సి ఉందని దరఖాస్తు చేసుకుంటే ఉపయోగం లేకుండా పోతుందని విద్యార్థుల 
తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలిటెక్నిక్  ప్రవేశానికి 
కౌన్సెలింగ్ ప్రక్రియ  ప్రస్తుతం వివిధ కారణాలతో ఆగినా త్వరల్లో మళ్లీ 
ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. సీట్ల 
కేటాయింపులో మార్కుల శాతం అడుగుతారు. సవరణ మార్కుల జాబితా రాకపోవడంతో ఎన్ని
 మార్కులు వచ్చాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. సమయం 
సమీపిస్తుండటంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన 
చెందుతున్నారు. ఇలా క్షేత్రస్థాయిలో విద్యార్థులు అనేక సమస్యలతో అవస్థలు 
పడుతున్నారు. పాఠశాలలకు వెళ్తే ఎప్పటికి ఇస్తారో కూడా ఉపాధ్యాయులు చెప్పడం 
లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ 
తీసుకుని త్వరితగతిన విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రాలేదంటున్నారు: పి.భాగ్యశ్రీ, మల్లవోలు, గూడూరు మండలం
నేను మల్లవోలు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పూర్తి చేశాను. గణితం, సోషల్
 సబ్జెక్టుల్లో  అనుకున్న మార్కులకంటే తక్కువ రావడంతో పునః పరిశీలనకు 
దరఖాస్తు చేసుకున్నాను. త్వరలో జరిగే పాలిటెక్నిక్ కౌన్సెలింగ్‌కు 
వెళ్లాల్సి ఉంది. దానికి సవరణ మార్కుల వివరాలు తెలియజేయాలని ఇప్పటికే 
అనేకసార్లు పాఠశాలకు వెళ్లినా ఇంకా రాలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
వారంలోగా వస్తాయి: తాహెరా సుల్తానా, కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి
ఎంతమందికి సవరణ మార్కుల జాబితాలు రావాల్సి ఉందో పూర్తిస్థాయి నివేదికను 
ఇప్పటికే పంపించాం. శాఖాపరంగా ఎలాంటి పెండింగ్ లేదు. రాష్ట్రవ్యాప్తంగా 23
 శిబిరాలు నిర్వహించారు. సబ్జెక్టుల వారీగా ఎక్కడెక్కడ ఈ శిబిరాలు జరిగాయో 
అక్కడినుంచి ప్రభుత్వానికి పంపిస్తారు. ఆ వెంటనే జాబితాలు విడుదలవుతాయి. 
ఒకరు ఒక సబ్జెక్టు, ఇంకొందరు రెండు అలా దరఖాస్తు చేసుకున్నారు. వారంలోపే 
అందరికీ జాబితాలు విడుదల అవుతాయి. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం 
లేదు. 
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు