PAN Aadhaar Link: మీ పాన్, ఆధార్ లింక్ కాలేదా? కారణాలు ఇవే
పాన్, ఆధార్ నెంబర్లు లింక్ (PAN-Aadhaar Link) చేయడానికి మరోసారి గడువు ముంచుకొస్తోంది. 2023 మార్చి 31 గా ఉన్న గడువును 2023 జూన్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ గడువు ఇంకొన్ని రోజుల్లోనే ముగియనుంది. పాన్ కార్డ్ (PAN Card) ఉన్నవారు రూ.1,000 జరిమానా చెల్లించి తమ ఆధార్ నెంబర్ లింక్ చేయాల్సి ఉంటుంది. అయితే రూ.1,000 పెనాల్టీ చెల్లించినవారు కూడా తమ ఆధార్ నెంబర్ లింక్ చేయలేకపోతున్నారు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. పాన్ కార్డ్ హోల్డర్స్ తమ ఆధార్ నెంబర్ లింక్ చేయలేకపోవడానికి గల కారణాలను వివరిస్తూ ఆదాయపు పన్ను శాఖ ఓ ట్వీట్ చేసింది.
ఆదాయపు పన్ను శాఖ వివరాల ప్రకారం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలు మ్యాచ్ కాకపోవడం వల్లే పాన్, ఆధార్ లింక్ కావట్లేదు. డెమొగ్రాఫిక్ మిస్‌మ్యాచ్ వల్ల ఈ సమస్య వస్తుందని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. పాన్ కార్డులో, ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, జెండర్ వేర్వేరుగా ఉండటం వల్ల పాన్, ఆధార్ లింక్ కాదు.
పాన్, ఆధార్‌ను సజావుగా లింక్ చేయడానికి పాన్, ఆధార్ కార్డుల్లోని వివరాలు ఒకేలా ఉండేలా చూసుకోవాలి. ఏ కార్డులో వివరాలు తప్పుగా ఉంటే ఆ కార్డులోనే వివరాలు సరిచేసుకోవాలి. లేకపోతే పాన్ సర్వీసెస్ ప్రొవైడర్స్‌కి చెందిన సెంటర్స్‌లో బయోమెట్రిక్ బేస్డ్ ఆథెంటికేషన్ ప్రాసెస్ పూర్తి చేసి పాన్, ఆధార్ లింక్ చేయొచ్చు. ఇందుకోసం రూ.50 ఛార్జీ చెల్లించాలి.
ఆధార్ కార్డులో వివరాలు సరిచేసుకోండి ఇలా
Step 1- ముందుగా https://myaadhaar.uidai.gov.in/ ఓపెన్ చేయాలి.
Step 2- మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
Step 3- Online Update Services పైన క్లిక్ చేయాలి.
Step 4- ఆ తర్వాత Update Aadhaar Online పైన క్లిక్ చేయాలి.
Step 5- Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి.
Step 6- పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్‌లో మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 7- మీ వివరాలు అప్‌డేట్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
పేమెంట్ అవసరం లేకుండా ప్రాసెస్ పూర్తి చేయాలి.
పేమెంట్ పూర్తైన తర్వాత మీకు అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ ఎస్ఎంఎస్‌లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. యూఆర్ఎన్ నెంబర్‌తో మీ ఆధార్ అప్‍డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఒకవేళ పాన్ కార్డులో వివరాలు తప్పుగా ఉంటే ఈ కింది స్టెప్స్‌తో సరిచేసుకోవచ్చు.
Step 1- ముందుగా https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
Step 2- అప్లికేషన్ టైప్‌లో Changes or Correction in existing PAN Data/Reprint of PAN Card సెలెక్ట్ చేసుకోవాలి.
Step 3- కేటగిరీలో INDIVIDUAL సెలెక్ట్ చేయాలి.
Step 4- పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, పాన్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేయాలి.
Step 5- చివరగా క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
Step 6- టోకెన్ నెంబర్ జెనరేట్ అవుతుంది.
Step 7- టోకెన్ నెంబర్ ద్వారా పాన్ దరఖాస్తు పూర్తి చేయాలి.
మీ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ అప్‌డేట్ అయిన తర్వాత పాన్, ఆధార్ లింక్ చేయొచ్చు.
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు