24, జూన్ 2023, శనివారం

EDLI: EPF ఈపీఎఫ్ మెంబర్స్‌కు స్పెషల్ ఇన్సూరెన్స్ స్కీమ్.. ఫీచర్లు, అర్హత, ఇతర వివరాలు.

హఠాత్తుగా కుటుంబ పెద్దను కోల్పోవడం మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి సందర్భాల్లో కుటుంబం రోడ్డున పడకుండా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఆదుకుంటాయి. అయితే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పాటు కొన్ని ప్రభుత్వ పథకాలు కూడా ఇన్సూరెన్స్‌ కవరేజీని ఆఫర్‌ చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) బెస్ట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్‌గా నిలుస్తోంది. దీన్ని ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అందిస్తుంది. ఇది EPF సభ్యులకు EPF, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్(EPS)తో పాటు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ అందిస్తుంది. యాక్టివ్ సర్వీస్ సమయంలో సభ్యుడు మరణించినప్పుడు EPF సభ్యుల నామినీలు ఒకేసారి లంప్‌ సమ్‌ ఇన్సూరెన్స్‌ అమౌంట్‌ అందుకుంటారు.

యాక్టివ్‌ EPFO ​​సభ్యులకు ఇన్సూరెన్స్‌ ప్రయోజనాలు అందించే లక్ష్యంతో 1976లో EDLI స్కీమ్‌ ప్రారంభమైంది. సభ్యులకు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం, వారి భవిష్యత్తుకు తోడ్పాటు అందించడం ఈ స్కీమ్‌ లక్ష్యం. ఈ పథకం కింద ఇన్సూరెన్స్‌ కవరేజీ అనేది సభ్యుడు మరణించడానికి ముందు 12 నెలల్లో ఎలాంటి నిర్దిష్ట మినహాయింపులు లేకుండా సంపాదించిన వేతనంపై ఆధారపడి ఉంటుంది.

* EDLI ఎవరు క్లెయిమ్‌ చేసుకోవచ్చు?

EPFO సభ్యుని కుటుంబ సభ్యులు EPF పథకం కింద నామినేషన్ వేయడానికి అర్హులు. నామినేషన్ కంప్లీట్‌ చేయని పక్షంలో.. పెద్ద కొడుకులు, వివాహిత మనవరాలు మినహా కుటుంబ సభ్యులందరూ అర్హులు. కుటుంబ సభ్యుడు లేదా నామినేషన్ లేకుంటే, చట్టపరమైన వారసుడు అర్హులు అవుతారు. మైనర్ నామినీ, కుటుంబ సభ్యుడు లేదా చట్టపరమైన వారసుని గార్డియన్‌ కూడా అర్హులు. 

* అవసరమైన డాక్యుమెంట్‌లు

EPF మెంబర్ డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, లబ్ధిదారుని ఆధార్ వివరాలు, బ్యాంక్ అకౌంట్‌ ప్రూఫ్‌ (క్యాన్సిల్డ్ చెక్కు/పాస్‌బుక్), ఫోటో వంటివి అవసరం.

* EDLI ఎలా క్లెయిమ్‌ చేయాలి?

- EDLI క్లెయిమ్‌ చేయడానికి ముందుగా అధికారిక EPF పోర్టల్

https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ఓపెన్‌ చేయాలి.

- అనంతరం 'డెత్‌ క్లెయిమ్‌ సబ్మిషన్‌ బై బెనిఫిషియరీ’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.

- ఆ తర్వాత ఓపెన్‌ అయిన పేజీలో నామినీ వివరాలు ఎంటర్‌ చేయాలి.

- లబ్ధిదారుడి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి.

- తర్వాత OTPని జనరేట్‌ చేయడానికి 'ఆథరైజ్డ్‌ పిన్‌’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

- EPFOకు డెత్ క్లెయిమ్ ఫైల్ చేయడానికి రిజిస్టర్డ్ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్‌ చేయండి.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: