Courses After Intermediate ఇంటర్‌ తర్వాత సాధారణ డిగ్రీలో ఏ ఏ గ్రూప్స్ ఉన్నాయి అవి ఏవి? దేనిలో చేరాలో నిర్ణయం మీరే తీసుకోండి...

మేటి భవిష్యత్తు సొంతం చేసుకోవడానికి ప్రొఫెషనల్‌ కోర్సులే చదవాల్సిన అవసరం లేదు. ఉన్నతస్థాయి అవకాశాలను అందుకోవడానికి ఈ చదువులొక్కటే ప్రామాణికం కాదు. సాధారణ డిగ్రీలతోనూ సంచలనం సృష్టించవచ్చు. ఇంటర్మీడియట్‌ తర్వాత దేశంలో ఎక్కువమంది బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లోనే చేరుతున్నారు. ఇప్పుడీ చదువులు కొత్త సబ్జెక్టులు, వైవిధ్య కాంబినేషన్లలతో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఉద్యోగాలు, ఉన్నత విద్యకూ దారి చూపుతున్నాయి!

రెండు తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ ప్రవేశాల క్రతువు ప్రారంభమైంది. అడ్మిషన్లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. తెలంగాణలో సుమారు వెయ్యి కళాశాలల్లో 200కు పైగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్‌) ద్వారా ప్రవేశం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్‌ అడ్మిషన్స్‌ మాడ్యూల్‌ ఫర్‌ డిగ్రీ కాలేజెస్‌ (ఓఏఎండీసీ)తో డిగ్రీ కోర్సుల్లోకి చేరవచ్చు.

దేశవ్యాప్తంగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) స్థాయిలో చేరుతోన్న కోర్సుల్లో బీఏ, బీఎస్సీ, బీకాంలవే మొదటి మూడు స్థానాలు. ఈ మూడింటిలోనూ ఇటీవల బీకాంలో చేరుతోన్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. బీఏ, బీకాం, బీఎస్సీల్లో దేశవ్యాప్తంగా సుమారు 400 గ్రూపు కాంబినేషన్లు ఉన్నాయి. తాజా పరిణామాలకు అనుగుణంగా సబ్జెక్టులను తీర్చిదిద్దడం, కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం, వైవిధ్య కాంబినేషన్లకు అవకాశం కల్పించడం.. ఈ కారణాలతో ఇవి ఆదరణ పొందుతున్నాయి. తక్కువ వ్యవధిలో, తక్కువ ఖర్చుతో పూర్తికావడం, కళాశాలలు దగ్గరగా ఉండటం, పోటీ పరీక్షలు, ఉన్నత విద్యకు ఉపయోగపడటం.. ఇవన్నీ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ప్రొఫెషనల్‌ కోర్సుల్లో పేరొందిన ప్రైవేటు విశ్వవిద్యాలయాలు సైతం ప్రధాన ప్రాంగణాల్లో కొత్త కాంబినేషన్లతో సాధారణ డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి. డిగ్రీతోపాటు సివిల్‌ సర్వీసెస్, పోటీ పరీక్షలు, సర్టిఫికేషన్‌ కోర్సులకు సమగ్ర శిక్షణా అందిస్తున్నాయి.

ఆనర్స్‌ కోర్సులు..

దేశంలో బీఏ కోర్సుదే పైచేయి. ఇంటర్మీడియట్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ బీఏలో చేరవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీకాంకు ప్రాధాన్యం లభిస్తోంది. ఈ కోర్సులోకి ఇంటర్‌లో కామర్స్‌/ మ్యాథ్స్‌ సబ్జెక్టులు చదివినవారికి అవకాశం ఉంటుంది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, డీమ్డ్‌ విద్యా సంస్థల్లో అవకాశం దక్కడం, తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌లో ఎక్కువ సీట్లు ఉండటంతో బీఎస్సీలో చేరే మ్యాథ్స్‌ విద్యార్థుల సంఖ్య గతంతో పోలిస్తే తగ్గుతోంది. దాదాపు డిగ్రీ కళాశాలలన్నీ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు అందిస్తున్నాయి. పాపులర్‌ కాంబినేషన్లు అన్ని సంస్థల్లోనూ ఉన్నాయి. డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు ఆసక్తి, భవిష్యత్తు లక్ష్యాలకనుగుణంగా గ్రూపుతోపాటు సబ్జెక్టుల కాంబినేషన్‌ ఎంచుకోవాలి. భవిష్యత్తులో పీజీ కోర్సుల్లో చేరడానికి యూజీలో ఆ సబ్జెక్టు చదివుండడం తప్పనిసరి. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని యూజీ సబ్జెక్టుల కాంబినేషన్‌ ఎంచుకోవాలి. 

కొన్ని సంస్థలు ఆనర్స్‌ విధానంలో బ్యాచిలర్‌ డిగ్రీలు అందిస్తున్నాయి. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మొత్తం 160 క్రెడిట్లు ఉంటాయి. వీరు నాలుగో ఏడాది ఆ సబ్జెక్టులో పరిశోధన కొనసాగించవచ్చు. ఈ తరహా చదువుల్లో ఎంపిక చేసుకున్న సబ్జెక్టులో అదనపు ప్రావీణ్యం పొందవచ్చు. ఏదైనా సబ్జెక్టుపై ప్రత్యేక ఆసక్తి ఉన్నవారు, ఆ సబ్జెక్టులో ఉన్నత విద్యను ఆశిస్తున్నవాళ్లు ఆనర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. మేజర్, మైనర్‌ సబ్జెక్టులు ఉంటాయి.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఇంటర్‌ మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఇంటర్‌ మార్కులు లేదా పరీక్షలో చూపిన ప్రతిభతో తీసుకుంటున్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాలన్నీ (సెంట్రల్‌ యూనివర్సిటీలు) యూజీ కోర్సులు అందిస్తున్నాయి. సీయూసెట్‌ ప్రతిభతో అవకాశం కల్పిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డిగ్రీ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. తెలంగాణలో సుమారు వెయ్యి కళాశాలల్లో 200కు పైగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్‌) ద్వారా ప్రవేశం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్‌ అడ్మిషన్స్‌ మాడ్యూల్‌ ఫర్‌ డిగ్రీ కాలేజెస్‌ (ఓఏఎండీసీ)తో డిగ్రీ కోర్సుల్లోకి చేరవచ్చు. కళాశాలలు, కోర్సులు, సీట్లు, ఫీజులకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వెబ్‌సైట్ల నుంచి పొందవచ్చు. రెండు రాష్ట్రాల్లోనూ డిగ్రీ ప్రవేశాల క్రతువు ప్రారంభమైంది. డిగ్రీ కళాశాలలకు న్యాక్‌ గ్రేడ్‌లను కేటాయించింది. వీటి ప్రకారం వరుసగా.. ఎ++, ఎ+, ఎ, బీ++, బీ+, బీ, సీ ముఖ్యమైనవి. కళాశాల ఎంపికలో ఈ గ్రేడులను ప్రామాణికంగా తీసుకోవచ్చు. 

బీఏ

ఈ కోర్సులో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టుల కాంబినేషన్‌కు బాగా పేరు. సివిల్స్, గ్రూప్‌-1, 2 తదితర పోటీ పరీక్షల ఆశావహులు, భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలని ఆశించేవారు వీటివైపు మొగ్గు చూపవచ్చు. టూరిజం, సైకాలజీ, సోషల్‌ వర్క్, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్, సోషియాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రొపాలజీ, జాగ్రఫీ, ఫిలాసఫీ, విమెన్‌ స్టడీస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, పాపులేషన్‌ స్టడీస్, హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ డ్యూటీస్, హాస్పిటాలిటీ.. ఇలా ఎంచుకోవడానికి ఎన్నో సబ్జెక్టులు బీఏలో అందుబాటులో ఉన్నాయి. ఈస్తటిక్స్‌ అండ్‌ బ్యూటీ థెరపీ, డిజిటల్‌ మీడియా అండ్‌ డిజైన్‌ కోర్సులనూ బీఏలో భాగంగా కొన్ని సంస్థలు అందిస్తున్నాయి.  

బీఎస్సీ

ఈ గ్రూపులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒకప్పుడు ఎంతో పాపులర్‌. ఇంటర్మీడియట్‌ మ్యాథ్స్‌ విద్యార్థులకు.. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్‌ టాప్‌ కాంబినేషన్‌గా చెప్పుకోవచ్చు. ఈ సబ్జెక్టులపై పట్టున్నవారు భవిష్యత్తులో మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఎక్కువమంది విద్యార్థులు చేరుతోన్న వాటిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ ముందుంటుంది. ఎల్రక్టానిక్స్, ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, జియాలజీ..ఇలా ఎన్నో సబ్జెక్టులను మ్యాథ్స్‌ విద్యార్థులు ఎంచుకోవచ్చు. ఇప్పుడు బీఎస్సీలోనూ డేటా సైన్స్, డేటా ఎనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌.. వంటి వైవిధ్య కోర్సులు ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, డీమ్డ్‌ సంస్థలు అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు నాలుగేళ్ల వ్యవధితో బీఎస్సీ(కంప్యూటర్‌ సైన్స్‌) ఆనర్స్‌ విధానంలో అందిస్తున్నాయి. ఐఐటీ మద్రాస్‌ అందించే ఆన్‌లైన్‌ బీఎస్సీ కోర్సులోనూ చేరవచ్చు. బైపీసీ స్ట్రీమ్‌లో బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మొదటి నుంచీ ఆదరణ పొందుతున్నాయి. వీరు మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, ఫారెస్ట్రీ, జెనెటిక్స్, సీడ్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ తదితర సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. 

బీకాం

కాంబినేషన్లు తక్కువే. కామర్స్‌ సబ్జెక్టు ప్రధానాంశంగా ఈ కోర్సు రూపొందడమే కారణం. ఇందులో పలు స్పెషలైజేషన్లు ఉన్నాయి. బీకాం (రెగ్యులర్‌/ ఆనర్స్‌/ ట్యాక్సేషన్‌/ కంప్యూటర్స్‌/ ఈ-కామర్స్‌/ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌/ అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌/ అడ్వర్టైజింగ్‌ అండ్‌ సేల్స్‌ మేనేజ్‌మెంట్‌/ ఫారిన్‌ ట్రేడ్‌/ బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌) వీటిలో ఏదైనా కోర్సు ఎంచుకోవచ్చు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు బీకాం జనరల్, ఆనర్స్‌లతోపాటు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉన్న బీకాం ఆనర్స్‌ + ఏసీసీఏ, బీకాం ఆనర్స్‌ + సీఐఎంఏ కాంబినేషన్లతో కోర్సులు అందిస్తున్నాయి. అసోషియేషన్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ సర్టిఫైడ్‌ అకౌంటెంట్స్‌ (ఏసీసీఏ)లో చేరినవారు 13 పేపర్లు పూర్తిచేయాలి. అయితే బీకాం ఆనర్స్‌ విద్యార్థులకు వీటిలో 6 పేపర్ల నుంచి మినహాయింపు లభిస్తుంది. బీకాం ఆనర్స్‌ + ఏసీసీఏ కోర్సు తెలుగు రాష్ట్రాల్లో కేఎల్‌యూ, గీతంతోపాటు మరికొన్ని సంస్థలు అందిస్తున్నాయి. విద్యార్థులు బీకాం చదువుతూ.. సీఎంఏ, సీఏ, సీఎస్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో చేరవచ్చు.  

స్వరూపం..

బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సు వ్యవధి మూడేళ్లే. ఆనర్స్‌లో కొన్ని చోట్ల నాలుగేళ్లు. పరీక్షలు సెమిస్టర్‌ విధానంలో ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సీబీసీఎస్‌) అనుసరిస్తున్నాయి. అన్ని డిగ్రీ కళాశాలల సిలబస్, విధివిధానాలు దాదాపు ఒకేలా ఉంటాయి. సెమిస్టర్‌ మధ్యలోనూ మిడ్‌ సెమ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి సెమిస్టర్‌లోనూ సబ్జెక్టులవారీ క్రెడిట్‌లు ఉంటాయి.

డిగ్రీ తర్వాత..

డిగ్రీ కోర్సుల్లో చేరినవారు వ్యక్తిగత ఆసక్తులను బట్టి భవిష్యత్తులో భిన్న మార్గాలను ఎంచుకోవచ్చు. సంబంధిత కోర్సులకు అనుబంధంగా ఉన్నత విద్యను కొనసాగించడం, మేనేజ్‌మెంట్‌ లేదా ప్రొఫెషనల్‌ కోర్సుల్లో (ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, లా..) చేరడం, కేంద్రం, రాష్ట్ర స్థాయుల్లో నిర్వహించే పలు ఉద్యోగాలకు సన్నద్ధం కావడం..వీటిలో ముఖ్యమైనవి. ఎవరికివారు తమ భవిష్యత్తు ఆశయాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చినవారు భవిష్యత్తులో కోరుకున్న స్థానాన్ని అందుకోవచ్చు. 

ప్రాచుర్యం పొందిన సబ్జెక్టు కాంబినేషన్లు 

ఎంపీసీతో.. 

మ్యాథ్స్, పిజిక్స్, కెమిస్ట్రీ

మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌

మ్యాథ్స్, ఫిజిక్స్, ఎల్రక్టానిక్స్‌

మ్యాథ్స్, ఎల్రక్టానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ 

మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌

మ్యాథ్స్, ఫిజిక్స్, జియాలజీ

మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్‌ (ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదివిన ఇతర గ్రూపుల వారూ ఇందులో చేరవచ్చు)

బైపీసీతో..

బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ

మైక్రో బయాలజీ, జెనెటిక్స్, కెమిస్ట్రీ

బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ

బయోటెక్నాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ

బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ

బయోటెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్, మైక్రోబయాలజీ

ఆక్వాకల్చర్‌ టెక్నాలజీ, కెమిస్ట్రీ, జువాలజీ

కెమిస్ట్రీ, జువాలజీ, అప్లైడ్‌ న్యూట్రిషన్‌

కెమిస్ట్రీ, బోటనీ, అప్లైడ్‌ న్యూట్రిషన్‌

ఫుడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ

ఆర్ట్స్‌..

హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్‌

హిస్టరీ, సోషియాలజీ, జాగ్రఫీ

సైకాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ

సైకాలజీ, మార్కెటింగ్, ఇంగ్లిష్‌ లిటరేచర్‌

మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం, ఇంగ్లిష్‌ లిటరేచర్, పొలిటికల్‌ సైన్స్‌

హిస్టరీ, ఇంగ్లిష్‌ లిటరేచర్, పొలిటికల్‌ సైన్స్‌

ఎకనామిక్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్‌ సైన్స్‌

హిస్టరీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్‌ సైన్స్‌

ఇంగ్లిష్‌ లిటరేచర్, జర్నలిజం, పొలిటికల్‌ సైన్స్‌

 సోషల్‌ వర్క్, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్‌

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.