డిప్లొమాతో ఆర్‌బీఐలో ఉద్యోగాలు ‣ 35 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌


జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 35 జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌/ ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌ పరీక్ష, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (ఎల్‌పీటీ) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే.. మూడేళ్ల డిప్లొమా (సివిల్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ లేదా ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌) 65 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించాలి. లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ 55 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సంపాదించాలి. జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌/ఎలక్ట్రికల్‌) డిప్లొమా అభ్యర్థులకు రెండేళ్లు, డిగ్రీ అభ్యర్థులకు ఏడాది అనుభవం ఉండాలి. లేదా పీఎస్‌యూలో ఏడాది గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రెయినింగ్‌ పూర్తిచేయాలి. 

వయసు 01.06.2023 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు కేటగిరీని బట్టి 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.450. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు రూ.50. 

పరీక్ష ఎలా ఉంటుంది?

ఆన్‌లైన్‌ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో.. 300 మార్కులకు ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. వ్యవధి 150 నిమిషాలు. ప్రశ్నపత్రంలో నాలుగు భాగాలుంటాయి. 1) ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 50 ప్రశ్నలు - 50 మార్కులు - 40 నిమిషాలు. 2) ఇంజినీరింగ్‌ డిసిప్లిన్‌ పేపర్‌-1 40 ప్రశ్నలు - 100 మార్కులు - 40 నిమిషాలు, 3) ఇంజినీరింగ్‌ డిసిప్లిన్‌ పేపర్‌-2 - 40 ప్రశ్నలు - 100 మార్కులు - 40 నిమిషాలు, 4) జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 50 ప్రశ్నలు - 50 మార్కులు - 30 నిమిషాలు. మొత్తం 180 ప్రశ్నలకు 300 మార్కులు. అభ్యర్థులు ప్రతి భాగంలోనూ అర్హత సాధించాలి. ప్రతి తప్పు సమాధానానికీ 1/4 మార్కు తగ్గిస్తారు. ఆన్‌లైన్‌ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా.. ఖాళీల సంఖ్యకు ఐదు రెట్లమందిని ఎంపిక చేసి షార్ట్‌లిస్ట్‌ను తయారుచేస్తారు. వీరి వివరాలను ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. వీరికి లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ (ఎల్‌పీటీ) నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎల్‌పీటీకి తప్పనిసరిగా హాజరుకావాలి. ఆన్‌లైన్‌ పరీక్ష, ఎల్‌పీటీ, మెడికల్‌ ఫిట్‌నెస్, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. 

జేఈ (సివిల్‌) పేపర్‌-1లో బిల్డింగ్‌ మెటీరియల్స్, ఎస్టిమేటింగ్, కాస్టింగ్‌ అండ్‌ వాల్యుయేషన్, సర్వేయింగ్, సాయిల్‌ మెకానిక్స్, హైడ్రాలిక్స్, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ మొదలైనవి. పేపర్‌-2లో థియరీ ఆఫ్‌ స్ట్రక్చర్స్, కాంక్రీట్‌ టెక్నాలజీ, ఆర్‌సీసీ డిజైన్‌ అండ్‌ స్టీల్‌ డిజైన్‌.. మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

జేఈ (ఎలక్ట్రికల్‌) పేపర్‌-1లో బేసిక్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, లైటింగ్‌ డిజైన్‌ ఆఫ్‌ ఆఫీస్‌ ఏరియాస్, ట్రాన్స్‌ఫార్మర్స్, వర్కింగ్‌ ప్రిన్సిపల్స్, ప్రొటెక్షన్‌ టైప్స్, ప్రివెంటివ్‌ మెయింటెనెన్స్, పంపింగ్‌ సిస్టమ్స్, వేరియస్‌ టైప్‌ ఆఫ్‌ మోటార్స్, వేరియస్‌ స్టార్టింగ్‌ మెథడ్స్‌ ఆఫ్‌ వేరియస్‌ టైప్స్‌ ఆఫ్‌ మోటార్స్, సబ్‌స్టేషన్‌ డిజైన్‌ అండ్‌ లేఅవుట్‌ ఇన్‌క్లూడింగ్‌ డీజీ సెట్‌ ఇన్‌స్టలేషన్స్, టైప్‌ ఆఫ్‌ ఎర్తింగ్, టెస్టింగ్, లైట్‌నింగ్‌ అరెస్టర్‌ మొదలైనవి.

పేపర్‌-2లో బేసిక్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ అండ్‌ రిఫ్రిజరేషన్, ఇన్వర్టర్స్, రెక్టిఫైయర్స్, యూపీఎస్‌ సిస్టమ్స్, ఎనర్జీ కన్సర్వేషన్‌ టెక్నిక్స్‌ ఎల్‌టీ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్, కేబ్లింగ్‌/ ఇంటర్నల్‌ వైరింగ్‌ సిస్టమ్, ప్యానల్‌ డిజైన్‌ అండ్‌ ఫాల్ట్‌ఫైండింగ్, ప్రివెంటివ్‌ మెయింటెనెన్స్, టెస్టింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్టలేషన్, బేసిక్స్‌ ఆఫ్‌ ఎలివేటర్స్, డిజైన్, ఎలక్ట్రికల్‌ సేఫ్టీస్, ప్రొటెక్షన్స్, కంట్రోలర్స్, బేసిక్స్‌ ఆఫ్‌ సీసీటీవీ సిస్టమ్, ఫైర్‌ అండ్‌ స్మోక్‌ అలారం సిస్టమ్, యూపీఎస్, ఇండియన్‌ ఎలక్ట్రిసిటీ రూల్స్, స్విచ్‌గేర్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ యూజ్డ్‌ ఇన్‌ హెచ్‌టీ/ఎల్‌టీ ఇన్‌స్టలేషన్స్‌ మొదలైన వాటి నుంచి ప్రశ్నలు ఇస్తారు. 

లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ (ఎల్‌పీటీ): ఆన్‌లైన్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎల్‌పీటీ నిర్వహిస్తారు. అభ్యర్థుల జోన్లను బట్టి అఫిషియల్‌/ లోకల్‌ లాంగ్వేజ్‌ల్లో పరీక్ష జరుపుతారు. వీటిల్లో ప్రావీణ్యంలేని అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తారు. సెంట్రల్‌జోన్‌కు హిందీ, తెలుగు, మరాఠీ లోకల్‌ లాంగ్వేజ్‌లు. 

సన్నద్ధత 

సిలబస్‌లోని చాప్టర్లను క్షుణ్ణంగా చదవడం ద్వారా రాత పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించడానికి కృషిచేయాలి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ అంశాలకు బ్యాంక్‌ పోటీ పరీక్షల పుస్తకాలు ఉపయోగం. పాత ప్రశ్నపత్రాలను సాధన చేస్తూ సన్నద్ధత స్థాయిని పరీక్షించుకోవాలి. ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో తెలుసుకుని వాటిని మెరుగుపరుచుకోవచ్చు. నెగెటివ్‌ మార్కులు ఉన్నాయి కాబట్టి పూర్తిగా తెలిసిన ప్రశ్నలకే సమాధానాలను గుర్తించాలి. జులైలోనే రాత పరీక్ష జరగనుంది కాబట్టి పకడ్బందీగా టైమ్‌టేబుల్‌ వేసుకుని సిద్ధమైతే ఫలితం ఉంటుంది. 

దరఖాస్తుకు చివరితేదీ: 30.06.2023

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 15.07.2023

వెబ్‌సైట్‌: https://www.rbi.org.in/

 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.