27, జూన్ 2023, మంగళవారం

తెలుగులోనూ జేఈఈ అడ్వాన్స్డ్ • ఇంజినీరింగ్ ప్రవేశాలకు ఉమ్మడి పరీక్షపై అధ్యయనం ఐఐటీ కౌన్సిల్లో తీర్మానాలు.

ఈనాడు, హైదరాబాద్: నీట్, జేఈఈ మెయిన్ తరహాలోనే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షనూ తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఐఐటీలు, ఎన్ఎస్ఐటీలు మినహా, దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు జాతీయస్థాయిలో ఒకే పరీక్ష నిర్వహణ సాధ్యాసాధ్యాలపై 5 నెలల్లో నివేదిక ఇచ్చే బాధ్యతను ఐఐటీ దిల్లీకి అప్పగించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన ఐఐటీ కౌన్సిల్ సమావేశం ఏప్రిల్ 18న భువనేశ్వర్లో జరిగిన విషయం తెలిసిందే. ఆ సమావేశం తీర్మానాలను తాజాగా కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
ఇతర ముఖ్య నిర్ణయాలు...
• 2024-25 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో క్రీడా కోటా అమలుకు విధి విధానాల రూపకల్పన బాధ్యతలను ఐఐటీ మద్రాస్కు అప్పగించారు. ఐఐటీల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మెరిట్ కమ్ మీన్స్ (ఎంసీఎం) స్కాలర్షిప్, పాకెట్ అలవెన్స్ను పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీనిపై ఐఐటీ ఖరగప్పర్ నివేదిక సమర్పించనుంది. పరిశ్రమల అవసరాల మేరకు ఎంటెక్ కోర్సులను రూపొందించాలని నిర్ణయించారు. దీనిపై ఐఐటీ హైదరాబాద్ నివేదిక సమర్పించనుంది. ఆర్ట్స్, ఇతర కోర్సుల్లో మల్టీ డిసిప్లినరీ విధానాన్ని ప్రారంభిస్తారు. ఆయా కోర్సుల్లో ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్ సబ్జెక్టులు మిళితమై ఉంటాయి. ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ (పీఎంఆర్ఎఫ్) రెండో విడతను అయిదేళ్లపాటు కొనసాగిస్తారు. ఏడాదికి వెయ్యి మంది చొప్పున అయిదేళ్లలో 5 వేల మంది పీహెచ్ విద్యార్థులకు ఈ ఫెలోషిప్ అందజేస్తారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: