24, జూన్ 2023, శనివారం

టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల * రీకౌంటింగ్‌, రీవెరిఫికే షన్‌కు దరఖాస్తు * పాసైన విద్యార్థులకు పాలిటెక్నిక్‌లో ప్రవేశం

ఈనెల జూన్‌ 2 నుంచి 10 వరకు జరిగిన టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 68.10 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 59.82 శాతం, బాలికలు 68.48 శాతం మంది పాసయ్యారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 91.21 శాతం, కృష్ణాజిల్లాలో అత్యల్పంగా 40.56 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ శుక్రవారం ఆన్‌లైన్‌లో ఈ ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు 2,12,289 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,87,092 మంది పరీక్ష రాస్తే 1,18,588 మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు  ఇంటర్మీడియట్‌లో (ప్రవేశాలకు ఎటువంటి ఇబ్బందిలేకుండా నాలుగు రోజుల్లో bse.ap.gov.in వెబ్‌సైట్‌లో మార్కుల జాబితాలను అందుబాటులో ఉంచనుంది. 

29లోగా రీకౌంటింగ్‌, రీవెరిఫికే షన్‌కు దరఖాస్తు...
కమిషనర్‌ మాట్లాడుతూ... ఒక్కో సబ్జెక్టుకు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా రూ.500 చెల్లించి జవాబుపత్రాల రీకౌంటింగ్‌, రూ.1,000 చెల్లించి రీవెరిఫికేషన్‌కు ఈ నెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తును పూరించి, హెచ్‌ఎం సంతకం చేసిన హాల్‌టికెట్‌ ఫొటో కాపీ, చలానాను జతచేసి ఆయా జిల్లాల్లోని డీఈఓ కార్యాలయాల్లో సమర్పించాలన్నారు. ఉత్తీర్ణులైన వారికి త్వరలో ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్లను నేరుగా పాఠశాలలకుపంపిస్తామన్నారు.

పాసైన విద్యార్థులకు పాలిటెక్నిక్‌లో ప్రవేశం
ఇక టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులూ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు జూలై 3 లోగా ఆన్‌లైన్‌ ద్వారా ప్రాసెసింగ్‌ రుసుము చెల్లించి, సమీప హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో ఒరిజినల్‌ సర్టిఫికేట్‌తో వెబ్‌ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. పాలిసెట్‌కు హాజరై ర్యాంకులు పొందిన వారికి కేటాయించిన తర్వాత మిగిలిన సీట్ల ఆధారంగా వీరికి కేటాయింపు ఉంటుందన్నారు. అయితే, సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారు పాలిసెట్లో అర్హత సాధించిన వారే అర్హులన్నారు. ఇందుకు సంబంధించి త్వరలో షెడ్యూల్‌ విడుదల చేస్తామన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సమీప ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లోని సహాయ కేంద్రాలను నేరుగా సందర్శించి సమాచారాన్ని పొందాలన్నారు. పూర్తి వివరాల కోసం https://appolycet.nic.in వెబ్‌సైట్‌ను సందర్మించాలని నాగరాణి సూచించారు.  

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share the watsapp link to your friends and help them join themselves

https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR

 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: