PM-Kisan App: పీఎం-కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్.. రైతులకు ఎలా యూజ్ అవుతుందంటే
PM-Kisan App: కేంద్ర ప్రభుత్వం పీఎం-కిసాన్ యాప్ లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేసింది.
పంట పెట్టుబడి సహాయం కోసం దేశంలోని రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో PM-కిసాన్ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చింది. ఈ స్కీమ్ ద్వారా అర్హులందరికీ, సులువుగా లబ్ధి అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా పీఎం-కిసాన్ యాప్(PM-Kisan App)లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌ను (Face Authentication Feature) ఇంట్రడ్యూస్ చేసింది. దీంతో ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని వినియోగిస్తున్న మొదటి కేంద్ర సంక్షేమ కార్యక్రమంగా పీఎం కిసాన్ నిలిచింది.
ఇప్పుడు పీఎం కిసాన్ లబ్ధిదారులైన రైతులు, తమ మొబైల్ డివైజ్‌లలో ముఖాలను స్కాన్ చేయడం ద్వారా ఈజీగా e-KYC ప్రాసెస్ కంప్లీట్ చేయవచ్చు. ముఖ్యంగా వృద్ధులకు ప్రాసెస్‌ను సులభతరం చేసే లక్ష్యంతో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌ను తీసుకొచ్చారు.
* ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ఎలా పని చేస్తుంది?
PM-కిసాన్ యాప్ ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌ను ఇంటిగ్రేట్ చేసింది. రైతులు తమ మొబైల్ డివైజ్‌లలో ఫేషియల్ స్కానింగ్ సాయంతో ఇ-కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయవచ్చు. ఇకపై ఫింగర్‌ప్రింట్‌లు లేదా వన్-టైమ్ పాస్‌వర్డ్‌ల వంటి ట్రెడిషినల్ అథెంటికేషన్ పద్ధతులు అవసరం లేదు.
* వృద్ధ రైతులకు ప్రయోజనం
మొబైల్ నంబర్లను తమ ఆధార్ కార్డ్‌లకు లింక్ చేయని వృద్ధ రైతులకు ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ టెక్నాలజీ e-KYC ప్రక్రియను సులభతరం చేస్తుంది. లబ్ధిదారులందరికీ యాక్సెసబిలిటీ, కన్వీనియన్స్ అందిస్తుంది.
* పైలట్ టెస్ట్ సక్సెస్‌ఫుల్
పీఎం కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ కోసం పైలట్ టెస్ట్ 2023 మే 21న ప్రారంభమైంది. అప్పటి నుంచి సుమారు 3 లక్షల మంది రైతులు ఈ పద్ధతిని ఉపయోగించి తమ e-KYCని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు.
* E-KYC ప్రాసెస్ సులభతరం
గతంలో PM-కిసాన్ లబ్ధిదారులు బయోమెట్రిక్ వెరిఫికేషన్ లేదా వారి రిజిస్డర్డ్ మొబైల్ నంబర్లకు పంపిన వన్-టైమ్ పాస్‌వర్డ్ ద్వారా e-KYC చేయించుకోవాలి. ఆధార్‌తో లింక్ కాని మొబైల్ నంబర్లు, వెరిఫికేషన్ సెంటర్లకు చేరుకోవడంలో ఇబ్బందులు రైతులకు సమస్యగా మారాయి. ఫేషియల్ అథెంటికేషన్ ఇలాంటి అడ్డంకులను తొలగించనుంది.
* యుటిలైజింగ్ ఆధార్ డేటా
ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ రైతుల ఆధార్ కార్డుల నుంచి ఐరిస్ డేటాను ఉపయోగించుకుంటుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇప్పటికే ఉన్న ఆధార్ ఐరిస్ డేటాకు ఫేషియల్ అథెంటికేషన్ ఫీచర్‌కు యాక్సెస్‌ను అందించింది.
* భాషిణితో ఇంటిగ్రేషన్ (Integration With Bhashini)
పీఎం-కిసాన్ పథకం, లాంగ్వేజెస్ కోసం గవర్నమెంట్ నేషనల్ పబ్లిక్
డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అయిన భాషిణితో మెర్జ్ అవుతోంది. భాషిణి రైతులకు వారి
ఇష్టపడే భాషలో సేవలు, సమాచారాన్ని అందించడానికి ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలను ఉపయోగించనుంది.
కామెంట్‌లు