ఎస్‌బీఐలో 5454 జూనియర్ అసోసియేట్ పోస్టులు.. Closure of registration of application 20/05/2021
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. క్లరికల్ కేడర్‌లో 5454 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) మొత్తం పోస్టుల సంఖ్య : 5454 (రెగ్యులర్–5000, బ్యాక్‌లాగ్– ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ –121, పీడబ్ల్యూడీ–96, ఎక్స్‌సర్వీస్‌మెన్–237). హైదరాబాద్ సర్కిల్(తెలంగాణ)లో పోస్టుల సంఖ్య: 275. విద్యార్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్/చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: 01.04.2021 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 02.04.1993 –01.04.2001 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరి...