28, ఏప్రిల్ 2021, బుధవారం

Tirupati latest jobs || పరీక్ష లేదు, తిరుపతిలో ఉద్యోగాలు, 3- 5 లక్షల వరకూ జీతం

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు.

APSSDC ఆధ్వర్యంలో భర్తీ చేయబోతున్న ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల పని తీరును బట్టి ఈ పోస్టులను పేర్మినెంట్ చేయనున్నారు.

భారీ స్థాయిలో జీతములు లభించే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుపతి నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు .

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిఏప్రిల్  29, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 9గంటలకు

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్, చెల్ల కాంప్లెక్స్, 6-1-68/B-1, కే. టీ. రోడ్, తిరుపతి – 517501.

Tirupati latest jobs

విభాగాల వారీగా ఖాళీలు :

ఏజెన్సీ డెవలప్ మెంట్ మేనేజర్స్5
ఏజెన్సీ మేనేజర్స్20

అర్హతలు :

గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఏజెన్సీ డెవలప్ మెంట్ మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.సంబంధిత విభాగాలలో 3-6 సంవత్సరాలు అనుభవం అవసరం.

ఆర్మీ /నేవీ /ఎయిర్ ఫోర్స్ /రిటైర్డ్ /వీఆర్ఎస్ /ఫార్మా /బ్యాంకింగ్ /ఫైనాన్స్ /సేల్స్ పీపుల్ తదితర రంగాలలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును అనీ ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఇంటర్మీడియట్ మరియు ఆపైన అర్హతలు కలిగి ఉన్నావారు ఏజెన్సీ మేనేజర్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

హోం మేకర్స్ /చిట్ ఓనర్స్ /రిటైర్డ్ /వీఆర్ఎస్ /ఫైనాన్స్ /డిస్ట్రిబ్యూషన్ /అన్ ఎంప్లాయిస్ /డీఎస్ఏ /డీఎంఏ /లోన్ ఎగ్జిక్యూటివ్స్ తదితరులు అందరూ ఈ ఏజెన్సీ మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనీ ప్రకటన ద్వారా తెలుపుతున్నారు.

వయసు :

ఏజెన్సీ డెవలప్ మెంట్ మేనేజర్స్ ఉద్యోగాలకు 30నుండి 40 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏజెన్సీ మేనేజర్స్ పోస్టులకు 30 నుండి 70 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఏజెన్సీ డెవలప్ మెంట్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 3నుండి 5 లక్షల రూపాయలు వరకూ జీతం లభించనున్నది.

మరియు ఇన్సెంటివ్స్ +బోనస్ +ప్రొవిడెంట్ ఫండ్ + ఉచిత ఇన్సూరెన్స్ కవరేజ్ లాంటి సౌకర్యాలు కల్పించనున్నారు.

ఏజెన్సీ మేనేజర్స్ పోస్టులకు ఎంపిక కాబడిన అభ్యర్థులకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు వరకూ జీతం మరియు ఇన్సెంటివ్స్ +బోనస్ +కెరీర్ గ్రోత్  ప్రమోషన్స్ వంటి సౌకర్యాలు లభించనున్నాయి.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

7799300659

8374421195

1800-425-2422

Registration Link 

Website

కామెంట్‌లు లేవు: