ఈ స్కూల్స్‌లో టీచర్‌ కొలువులు...దరఖాస్తులకు చివరి తేదీ: 30 ఏప్రిల్‌ 2021

దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌స్కూల్స్‌(ఈఎంఆర్‌ఎస్‌)లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
 
మొత్తం 3476 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ప్రిన్సిపల్, వైస్‌ప్రిన్సిపల్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ), ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ) పోస్టులున్నాయి. వీటిలో తెలంగాణకు సంబంధించి 262 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 117 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్‌ 30వ తేదీలోగా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు..
  • ప్రిన్సిపల్‌–175
  • వైస్‌ ప్రిన్సిపల్‌–116
  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌–1244
  • ట్రైయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌–1944.

రాష్ట్రాల వారీగా ఖాళీలు..
ఆంధ్రప్రదేశ్‌–117(ప్రిన్సిపల్‌ 14, వైస్‌ ప్రిన్సిపల్‌ 06, టీజీటీ 97), తెలంగాణ–262(ప్రిన్సిపల్‌11, వైస్‌ ప్రిన్సిపల్‌ 06, పీజీటీ 77, టీజీటీ 168), ఛత్తీస్‌గఢ్‌–514, గుజరాత్‌–161, హిమాచల్‌ప్రదేశ్‌–08, జార్ఖండ్‌–208, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌–14, మధ్యప్రదేశ్‌–1279, మహా రాష్ట్ర–216, మణిపూర్‌–40, మిజోరం–10, ఒడిశా–144, రాజస్తాన్‌–316, ఉత్తరప్రదేశ్‌–79, ఉత్తరాఖండ్‌–09, సిక్కిం–44, త్రిపుర–58.

ఈఎంఆర్‌ఎస్‌..
గిరిజన ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడానికి ఏర్పాటు చేసినవే.. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌(ఈఎంఆర్‌ఎస్‌). ప్రస్తుతం 17 రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న 3476 పోస్టుల ఖాళీల భర్తీకి కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న పాఠశాలలతోపాటు ప్రస్తుత ఏడాది ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో వీరిని భర్తీచేసే అవకాశం ఉంది.

విద్యార్హతలు..
ప్రిన్సిపల్‌ : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 45శాతం మార్కులతో మాస్టర్‌ డిగ్రీ, బీఎడ్‌ లేదా తత్సమాన డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే హిందీ, ఇంగ్లిష్‌ మీడియం బోధనలో నైపుణ్యం, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
వైస్‌ ప్రిన్సిపల్‌: వైస్‌ ప్రిన్సిపల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ, బీఈడ్‌ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
పీజీటీ: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్‌ డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వీటితోపాటు హిందీ, ఇంగ్లిష్‌ మీడియం బోధనలో నైపుణ్యం ఉండాలి.
టీజీటీ : టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు బీఈడీ, సంబంధిత సబ్జెక్టుల్లో సీటెట్‌/టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. వీటితోపాటు హిందీ, ఇంగ్లిష్‌ మీడియం బోధనలో నైపుణ్యం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :
కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ), ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. టీజీటీ అభ్యర్థులకు ఇంటర్వ్యూ రౌండ్‌ ఉండదు. ఎంపికకు సంబంధించిన అర్హత పరీక్షలను ఆయా ప్రాంతాల్లోనే నిర్వహిస్తారు.

ముఖ్యమైన సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేదీ: 30 ఏప్రిల్‌ 2021
పరీక్ష తేదీ: జూన్‌ మొదటి వారంలో

వెబ్‌సైట్‌: https://tribal.nic.in   
Published on 4/3/2021 4:47:00 PM

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.