3, ఏప్రిల్ 2021, శనివారం

ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ రిక్రూట్మెంట్ , బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Govt Jobs Recruitment AP 2021

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా నుండి విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగులు ) కు సంబంధించిన బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.

ఎటువంటి పరీక్షలు లేకుండా రిజర్వేషన్స్ మరియు మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల స్థానిక దివ్యాంగుల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. AP Govt Jobs Recruitment AP 2021

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నంద్యాల మరియు కర్నూల్ జిల్లాల్లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు ప్రారంభం తేదిమార్చి 30 , 2021
దరఖాస్తుకు చివరి తేదిఏప్రిల్ 22, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

ల్యాబ్ టెక్నీషియన్1
ఫార్మసీస్ట్1
ఎంపీహెచ్ఏ (పురుషులు )2
ఎంపీహెచ్ఏ ( స్త్రీలు )2

అర్హతలు :

10వ తరగతి  మరియు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులో రెండు సంవత్సరాల డిప్లొమా అర్హతలు గా కలిగిన అభ్యర్థులు అందరూ ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డీ. ఫార్మసీ / బీ. ఫార్మసీ కోర్సులు పూర్తి చేసి, ఏపీ ఫార్మసీ కౌన్సిల్ లో రిజిస్టర్ అయినా  అభ్యర్థులు ఫార్మసిస్ట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

10వ తరగతి /ఇంటర్ విద్యా అర్హతలతో పాటు ఏడాది ఎంపీహెచ్ఏ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఎంపీహెచ్ఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు .

మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ చూడవచ్చును.

వయసు :

18 నుండి 52 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

అకాడమిక్ మెరిట్ మరియు వెయిటేజ్ ప్రాతిపదికన ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15,000 రూపాయలు పైన జీతం లభించనుంది.

దరఖాస్తులు పంపవల్సిన చిరునామా :

సహాయ సంచాలకులు , విభిన్న ప్రతిభా వంతులు , హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ , కలెక్టర్ కాంప్లెక్స్, కర్నూల్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్ :

08518-277864

Website 

Notification and Apply Now

కామెంట్‌లు లేవు: