29, ఏప్రిల్ 2021, గురువారం

ఐఐఐటీడీఎం, కర్నూలులో 10 ఫ్యాకల్టీ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది మే 15..

 

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కర్నూలు(ఏపీ)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (ఐఐఐటీడీఎం).. టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు:
ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌– 05, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌– 01, మెకానికల్‌ ఇంజనీరింగ్‌–02, సైన్సెస్‌–02.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: దీన్ని రెండు విధాలుగా నిర్వహిస్తారు. అవి.. సెమినార్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. కొన్ని విభాగాలు స్క్రీనింగ్‌ టెస్ట్‌ కూడా నిర్వహించే అవకాశం ఉంది. మొదటగా షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల్ని సెమినార్‌కి పిలుస్తారు. సెమినార్‌లో ప్రతిభ ఆధారంగా ఎంపికైన వారిని ఇంటర్వూకి ఆహ్వానిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.05.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.iiitk.ac.in

కామెంట్‌లు లేవు: